అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (IMD) హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిర్మల్, నిజామాబాద్ (Nizamabad), ఆదిలాబాద్ (Adilabad), ఆసిఫాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో రాబోయే 3 గంటల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో రాబోయే 4 గంటల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి వర్షాల తీవ్రత అధికంగా ఉండనుంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
Telangana Rain Alert | జాగ్రత్తలు పాటించాలి
తెలంగాణలో (Telangana Rain Alert) మార్చి 16-20 తేదీల మధ్యలో చాలా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, బలమైన ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 18, 19 తేదీల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. గాలివాన, ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రైతులు తమ పంటలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ముఖ్యంగా కోసిన పంటలను ఆరు బయట నిల్వ చేయొద్దు. ఆరు బయట ఉంటే టార్పాలిన్లు కప్పుకోవాలి.
దీనిని కూడా చదవండి : Anganwadi Half Day | అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట

