అక్షరటుడే, వెబ్డెస్క్ : Rythu Bharosa Funds | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నెల 22న తొలి విడుత రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని తెలిపింది.
రాష్ట్రంలో రైతు భరోసా కోసం రైతులు నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్ ప్రారంభం సమయంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో పెట్టుబడి సాయం అందాలి. అయితే యాసంగి కోతలు సమీపిస్తున్నా రైతు భరోసా లేకపోవడంతో అన్నదాతలు ఇన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారు. ఈ సీజన్లో అసలు ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..
Rythu Bharosa Funds | సిద్దిపేట జిల్లాలో..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revath Reddy) రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. తొలి విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఈ నెల 22న సిద్దిపేట (Siddipet) జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
Rythu Bharosa Funds | ఎకరంలోపు రైతులకు..
మొదటి విడతలో భాగంగా ఎకరంలోపు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేయనున్నారు. ఇటీవల మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రైతు భరోసా కింద రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. మార్చి నెలలో తొలి విడతగా రూ.4,500కోట్ల వేస్తామని, మిగతా నిధులను ఏప్రిల్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. తొలి విడతగా ఎకరంలోపు భూమి ఉన్న మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. 20 రోజుల తర్వాత రెండో విడతలో రూ..2,650 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ చివరి వరకు అందరు రైతులకు నిధులు జమ చేస్తామని వెల్లడించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
First installment of Rythu Bharosa funds to be released on March 22.
•Honourable Chief Minister Sri A @revanth_anumula will release the Rythu Bharosa funds from Narmetta in Siddipet district.
•The Chief Minister held discussions with Deputy Chief Minister Mallu Bhatti…
— Jacob Ross (@JacobBhoompag) March 15, 2026
దీనిని కూడా చదవండి : Malla Reddy Dance | మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్ డ్యాన్స్

