అక్షరటుడే, హైదరాబాద్: Raj Gopal Reddy Dinner | తెలంగాణ కాంగ్రెస్ లో తాజా రాజకీయ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి Komatireddy Raj Gopal Reddy నిర్వహించినట్లు చెబుతున్న రహస్య డిన్నర్ మీటింగ్ అంశం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను మరింత వేడెక్కించినట్లు తెలుస్తోంది. ఈ అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
Raj Gopal Reddy Dinner | రహస్యంగా డిన్నర్ మీటింగ్
దాదాపు 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజగోపాల్ రెడ్డి ఈ డిన్నర్ మీటింగ్‌కు ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది. కానీ, గురువారం సాయంత్రం వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే రహస్యంగా ఈ మీటింగ్‌కు హాజరైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది ? ఏ అంశాలపై చర్చ జరిగింది ? అనేది మాత్రం వెల్లడికాలేదు.
Raj Gopal Reddy Dinner | మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి?
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కనీయలేదని గత కొంతకాలంగా ముఖ్యమంత్రి A. Revanth Reddyపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన భవిష్యత్ రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఈ డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో కలకలం
ఈ సమావేశ అంశం బయటకు పొక్కడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చలు వేడెక్కాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి Jeevan Reddy పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ షాక్ నుంచి పార్టీ వర్గాలు తేరుకోకముందే రాజ గోపాల్ రెడ్డి రహస్య మీటింగ్ మరోసారి కలకలం రేపింది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయా.. ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ వైపు మొగ్గు?
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మరో ప్రచారం ప్రకారం.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ నేతలు.. రాజకీయ సమీకరణాలపై చర్చలు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలువడలేదు.
రాజకీయ సమీకరణాలు..
రహస్య డిన్నర్ సమావేశం కేవలం సాధారణ మీటింగా..? లేక తెలంగాణ రాజకీయాల్లో మార్పులకు నాంది కాబోతుందా..? అన్నదానిపై మరింత ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి పెరుగుతోందా..? లేక భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై చర్చ జరిగిందా..? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

