Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Oscars 2026 | వైభవంగా ప్రారంభమైన 98వ ఆస్కార్ వేడుకలు.. కొత్త కేటగిరీతో చరిత్రలో కీలక మార్పు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Oscars 2026 | వైభవంగా ప్రారంభమైన 98వ ఆస్కార్ వేడుకలు.. కొత్త కేటగిరీతో చరిత్రలో కీలక మార్పు

సినిమా

Oscars 2026 | వైభవంగా ప్రారంభమైన 98వ ఆస్కార్ వేడుకలు.. కొత్త కేటగిరీతో చరిత్రలో కీలక మార్పు

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలు ఈసారి ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కొత్తగా ‘బెస్ట్ కాస్టింగ్’ విభాగాన్ని చేర్చడంతో మొత్తం కేటగిరీలు 24కి పెరిగాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 16, 2026 11:16 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Oscars 2026

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Oscars 2026 | అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌ (Los Angeles)లో సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 98వ అకాడమీ అవార్డుల వేడుకలు (ఆస్కార్ 2026) మార్చి 16న అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ సినీ పరిశ్రమ (Film Industry)లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలో ఈసారి ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. గతంలో 23 విభాగాల్లో అవార్డులు అందజేసే అకాడమీ, ఈసారి కొత్తగా ‘బెస్ట్ కాస్టింగ్’ అనే విభాగాన్ని చేర్చింది.

Contents
  • Oscars 2026 | హాలీవుడ్‌తో పాటు
    • Oscars 2026 | ఆస్కార్ అవార్డులు
      • Oscars 2026 | ఆస్కార్ 2026 ప్రధాన విజేతలు

Oscars 2026 | హాలీవుడ్‌తో పాటు

దీంతో మొత్తం అవార్డు కేటగిరీల సంఖ్య 24కు పెరిగింది.ఈ వేడుకలో హాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు భారీగా పాల్గొన్నారు. భారతీయ మూలాలున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో విజేతగా నిలిచిన ‘సెంటిమెంటల్ వాల్యూ’ చిత్రాన్ని ప్రకటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Oscars 2026

Oscars 2026 | ఆస్కార్ అవార్డులు

ఈ ఏడాది ఆస్కార్ అవార్డులు 2025లో విడుదలైన అత్యుత్తమ చిత్రాలకు ప్రదానం చేశారు. పలు చిత్రాలు విభిన్న విభాగాల్లో అవార్డులు గెలుచుకుని విశేష గుర్తింపు పొందాయి. ముఖ్యంగా ‘సిన్నర్స్’, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘ఫ్రాంకెన్‌స్టీన్’ వంటి చిత్రాలు పలు విభాగాల్లో అవార్డులు సాధించి మెరిశాయి. ఇక ఈ ఏడాది మరో విశేషం ఏమిటంటే ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో Live Action Short Film రెండు చిత్రాలకు అవార్డులు దక్కడం. ఇది ఈ కేటగిరీలో అరుదుగా జరిగే విషయం కావడం విశేషంగా నిలిచింది.

Oscars 2026 | ఆస్కార్ 2026 ప్రధాన విజేతలు

ఉత్తమ నటుడు: మైఖెల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)
ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ సాంగ్ (కె-పాప్ డిమాన్ హంటర్స్)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వాల్యూ (నార్వే)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా (సిన్నర్స్)
ఉత్తమ ఎడిటింగ్: యాండీ జుర్గెన్‌సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్)
ఉత్తమ సౌండ్: గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్‌డాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ. రిజో, జాన్ పెరల్ట (ఎఫ్1)
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: మిస్టర్ నోబడీ అగైనెస్ట్ పుతిన్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎంప్టీ రూమ్స్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్ సైండన్, డేనియల్ బారెట్ (అవతార్: ఫైర్ అండ్ యాష్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకెన్‌స్టీన్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్), ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్), ఉత్తమ సహాయ నటి: అమీ మాడిగన్ (వెపన్స్), ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్‌స్టీన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్‌స్టీన్), ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హు క్రైడ్ పర్ల్స్, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కె-పాప్ డిమాన్ హంటర్స్,
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్ ఎక్స్‌చేంజింగ్ సలైవా.

మొత్తంగా చెప్పాలంటే, ఈ ఏడాది ఆస్కార్ అవార్డులు (Oscar Awards) కొత్త కేటగిరీతో పాటు పలు విశేషాలతో సినీ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయి. ప్రపంచ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డులు మరోసారి అత్యుత్తమ ప్రతిభను గుర్తించి గౌరవించాయి.

ఇది కూడా చదవండి..: Monalisa Love Marriage | తండ్రిపై కేసు పెట్టి.. ప్రియుడిని పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా

Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు
Bellamkonda Srinivas Engagement | అది నిశ్చితార్థం కాదు.. కావ్యమ్మపై ప్రేమని వ్య‌క్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్
Vijay Rashmika honeymoon | హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న విజ‌య్-ర‌ష్మిక‌.. స్పెష‌ల్ వీడియోతో షాక్ ఇచ్చిన విరోష్ జంట‌
Shivaji Raja Father Death | సీనియర్ నటుడు శివాజీ రాజా తండ్రి కన్నుమూత.. శోక‌సంద్రంలో కుటుంబ స‌భ్యులు
Vijay Deverakonda Scholarships | విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు!
TAGGED:Film IndustryLos AngelesOscar AwardsOscars 2026
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Rain Alert Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన
Next Article Iran Drone Attacks Iran Drone Attacks | డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్​ భీకరదాడులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?