అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dubai Airport Drone Attack | దుబాయ్ ఎయిర్‌పోర్టు (Dubai Airport) సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. దీంతో తాత్కాలికంగా విమాన సర్వీసులు రద్దు చేశారు. డ్రోన్ దాడితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అధికారులు మంటలను ఆర్పి వేశారు. ఈ ఘటనతో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
దుబాయ్‌లోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport)లో సోమవారం డ్రోన్ విమానాశ్రయానికి సమీపంలోని ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ ప్రయాణ కేంద్రాలలో ఒకదానిలో విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అత్యవసర బృందాలు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి ఇరాన్ తరచూ దుబాయ్‌పై దాడులు చేస్తోంది. తాజా దాడులతో అనేక విమానాలను దారి మళ్లించారు.
Dubai Airport Drone Attack | ఎయిర్పోర్ట్ మూసివేత
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన ట్యాంక్‌ను డ్రోన్ ఢీకొట్టిందని దుబాయ్ అధికారులు ధృవీకరించారు. సివిల్ డిఫెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయన్నారు. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రయాణీకులు, సిబ్బంది భద్రత కోసం విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కొన్ని విమానాలను అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DWC)కి మళ్లించారు. ప్రయాణికులు విమానాశ్రయానికి రావొద్దని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ కోరింది.
ఇది కూడా చదవండి..: North Korea Missile Launch | బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా..

