Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం

హైదరాబాద్​ నగరంలో ఓ బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి డివైడర్​ను ఢీకొంది.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 1:57 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
BMW Car Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BMW Car Accident | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఓ బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి డివైడర్​ను ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు టైర్​ ఊడిపోయింది.

ఫిలిం నగర్‌ (Film Nagar)లో సోమవారం ఉదయం అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పింది. అనంతరం డివైడర్​ను ఢీకొంది. కారు ముందుటైర్​ ఊడిపోయిందంటే ఎంత వేగంగా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే కారులో ఎయిర్​ బ్యాగ్​లు తెరుచుకోవడంతో డ్రైవర్​ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. కారు ముందు భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డుపై ఉన్న కారును పక్కకు తొలగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. కారును నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

BMW Car Accident | దూసుకెళ్తున్నారు

రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరిగాయి. ముఖ్యంగా కార్లు ఢీకొని చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కారులను అతివేగంగా నడపడం, మద్యం మత్తులో దూసుకెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఎండబ్ల్యూ, బెంజ్​, ఆడి వంటి లగ్జరీ కార్లు ఉన్న వారు అతివేగంగా వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇతర వాహనాదారులను వీరు ఢీకొంటున్నారు. ఈ లగ్జరీ కార్లలో సేఫ్టీ ఫీచర్లు ఉండటంతో అందులోని వారు ప్రాణాలతో బయట పడుతున్నారు. అయితే వీరు చేసే పొరపాట్లకు సామాన్య ప్రజలు చనిపోతున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసే వారి​పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి..: Nepali Gang Theft | రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్​.. జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ

Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు
March 20 Horoscope | నగలు, అలంకరణ వస్తువులపై పెట్టుబడితో అఖండ ధనలాభం..ఈ రాశుల వారికి సువర్ణావకాశం!
March 17 Horoscope | వ్యాపార భాగస్వామ్యాలకు అనుకూలమైన రోజు.. ఈ రాశుల వారికి లాభాల వర్షం ఖాయం!
Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
TAGGED:BMW Car AccidentFilm NagarHyderabadRoad Accidents
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Jeevan Reddy Resignation Jeevan Reddy Resignation | కాంగ్రెస్​కు రాజీనామా చేయనున్న జీవన్​రెడ్డి.. ఏ పార్టీలో చేరుతారో?
Next Article Elderly Mother Complaint Elderly Mother Complaint | కన్నోళ్లు పట్టించుకుంటలేరు.. ఓ తల్లి ఆవేదన.. ప్రజావాణిలో ఫిర్యాదు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?