అక్షరటుడే, వెబ్డెస్క్: Narsingi Tragedy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు.
నగరంలోని నార్సింగి (Narsingi)లో ఓ యువకుడు ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని ఆశ చూపించాడు. చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అనంతరం హత్య చేశాడు. బాలిక ఆదివారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Narsingi Tragedy | సీసీ ఫుటేజీ ఆధారంగా..
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు (Narsingi Police) కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఓ వ్యక్తి బాలికను తీసుకు వెళ్తున్నట్లు ఉంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో హత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. రాత్రి ఒంటి గంట సమయంలో బాలిక మృతదేహాన్ని పోలీసులకు చూయించాడు. దీంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Narsingi Tragedy | కఠిన చర్యలు అవసరం
ఇటీవల చిన్నారులపై లైంగిక దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది కామాంధులు బాలికపై కన్నేస్తున్నారు. ఎవరు లేని సమయంలో మాయమాటలు చెప్పి చిన్నారులను తీసుకెళ్తున్నారు. అనంతరం లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కొందరు దుర్మార్గులు హత్యలు సైతం చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని మదనపల్లిలో ఏడేళ్ల బాలిక హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లలపై లైంగిక దాడులు చేసే వారిని ఉరి తీయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Attapur Hydraa Demolition | అత్తాపూర్లో హైడ్రా కూల్చివేతలు

