Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy ACB Raids | బల్దియాలో 8గంటల పాటు ఏసీబీ సోదాలు.. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు గుర్తింపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy ACB Raids | బల్దియాలో 8గంటల పాటు ఏసీబీ సోదాలు.. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు గుర్తింపు

నిజామాబాద్

Kamareddy ACB Raids | బల్దియాలో 8గంటల పాటు ఏసీబీ సోదాలు.. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు గుర్తింపు

కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ చేపట్టిన సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 10 గంటలకు మొదలైన సోదాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి.

Shashi kiran mottala
Last updated: మార్చి 16, 2026 7:52 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Kamareddy ACB Raids |
Kamareddy ACB Raids | బల్దియాలో 8గంటల పాటు కొనసాగిన ఏసీబీ సోదాలు.. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు వెల్లడి..!

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy ACB Raids | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ చేపట్టిన సోదాల్లో (Telangana ACB Investigation) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 10 గంటలకు మొదలైన సోదాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ముఖ్యంగా(Kamareddy Municipality News) సానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలపై వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది.

Contents
  • Kamareddy ACB Raids | పట్టణంలో అక్రమ నిర్మాణాలు..
    • Kamareddy ACB Raids | ప్రభుత్వానికి రూ.కోటికి పైగా నష్టం..!

Kamareddy ACB Raids | పట్టణంలో అక్రమ నిర్మాణాలు..

పట్టణంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఎప్పటినుంచో(Kamareddy ACB Raids) వస్తున్నా అధికారుల్లో చలనం కనిపించలేదు. పైగా అక్రమ నిర్మాణాల్లో కమీషన్లు తీసుకుని అనుమతులిచ్చారన్న ఆరోపణలున్నాయి. ఏసీబీ తనిఖీల్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. 2025-26 సంవత్సరంలో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులు వచ్చినా నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్య తీసుకోలేదని ఏసీబీ తనిఖీల్లో తేలింది. పట్టణంలోని కమర్షియల్ షాపుల లైసెన్సులపై ఆరోపణలున్నాయి. 400కు పైగా వాణిజ్య షాపుల ట్రేడ్ లైసెన్స్ (Trade License Issues) రెన్యువల్స్ పెండింగ్‌లో ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది.

Kamareddy ACB Raids | ప్రభుత్వానికి రూ.కోటికి పైగా నష్టం..!

అధికారుల తీరుతో ప్రభుత్వానికి (Illegal Constructions Telangana) సుమారు రూ. కోటి బకాయిలు ఏర్పడ్డాయని ఏసీబీ పేర్కొంది. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్లలో తేడాలు గుర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మున్సిపల్ అధికారుల ఫ్యుయెల్ ఛార్జీలలో చేతివాటం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. నెలకు రూ.12.40 లక్షలు కేటాయించినా, సరైన రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల (ACB Raids India) వేతనాల్లో భారీ వ్యత్యాసం బయటపడింది. కొంతమంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను (Telangana Corruption News) గైర్హాజరుగా మార్క్ చేసినా పూర్తి నెల జీతం చెల్లించారు. పూర్తి జీతం చెల్లింపుల విషయంలో కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలు గతంలో వినిపించినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. భవన నిర్మాణాల అనుమతులలో జాప్యం ఉందని ఏసీబీ తనిఖీల్లో బట్టబయలయ్యాయి. డిసెంబర్ 2025 నుంచి 169 బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తుల్లో 18 ఆలస్యంగా ప్రాసెస్ అయ్యాయని తేలింది. తనిఖీల రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తామని అధికారులు తెలిపారు.

ACB Raids in Kamareddy

ఇది కూడా చదవండి: Telangana Hailstorm Rain | పలు​ జిల్లాల్లో వడగళ్ల వాన.. ఆందోళనలో రైతులు

Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం
IVF Services Praised | ఐవీఎఫ్ సేవలు అభినందనీయం: జిల్లా న్యాయసేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి
Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
Field Visits by Officers | ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి
TAGGED:ACB Raids IndiaIllegal Constructions TelanganaKamareddy ACB RaidsKamareddy Municipality NewsMunicipal administration TelanganaTelangana ACB InvestigationTelangana Corruption NewsTrade License Issues
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Hailstorm Rain Telangana Hailstorm Rain | పలు​ జిల్లాల్లో వడగళ్ల వాన.. ఆందోళనలో రైతులు
Next Article BJP Bengal Candidates BJP Bengal Candidates | బెంగాల్​పై బీజేపీ ఫోకస్​.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?