అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Pond Death | అదృశ్యమైన వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలో చోటు చేసుకుంది.
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డుకు చెందిన చిట్యాల దుర్గేందర్ శనివారం నుంచి కనిపించడం లేదు. దీంతో ఆయన సోదరుడు పరంధాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అది దుర్గేందర్ది గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Yellareddy Pond Death | మానసిక పరిస్థితి సరిగ్గా లేక..
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దుర్గేందర్కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లి వచ్చేవాడని తెలిసింది. శనివారం రాత్రి హైదరాబాద్ (Hyderabad) నుంచి లింగారెడ్డిపేట గ్రామానికి బయలుదేరి వచ్చి, ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ వద్ద బస్సు దిగాడు. అనంతరం పెద్ద చెరువు వైపు వెళ్లి చెరువులో పడిపోయి మృతి చెందినట్లు భావిస్తున్నట్లు ఎస్సై బొజ్జ మహేష్ (SI Bojja Mahesh) తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుర్గేందర్ మృతితో లింగారెడ్డిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
దీనిని కూడా చదవండి : Narsingi Tragedy | హైదరాబాద్లో దారుణం.. ఆరేళ్ల బాలికపై హత్యాచారం

