అక్షరటుడే, న్యూఢిల్లీ: March 17 Pre Market Analysis | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. మార్కెట్లు కోలుకుంటున్నాయి. గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు(European markets) లాభాలతో ముగియగా.. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు సైతం లాభాల బాటలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు సైతం గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు గిఫ్ట్ నిఫ్టీ సంకేతాలిస్తోంది.
March 17 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో ఏఐ సంబంధిత స్టాక్స్ రాణించాయి. దీంతో నాస్‌డాక్(Nasdaq) 1.22 శాతం, ఎస్ అండ్ పీ 1.01 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.01 శాతం నష్టంతో ఉంది. మెటా 2.3 శాతం, అమెజాన్ 1.96 శాతం, ఎన్వీడియా 1.6 శాతం, మైక్రో సాఫ్ట్ 1.11 శాతం, టెస్లా 1.1 శాతం, ఆపిల్ 1.08 శాతం పెరిగాయి.
March 17 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.55 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్(DAX) 0.50 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.31 శాతం లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లు..
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్నా.. ఇతర దేశాల షిప్‌లను అడ్డుకోబోమన్న ఇరాన్ ప్రకటనతో ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. ఉదయం 7.40 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 2.61 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.54 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.53 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 1.19 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.53 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.35 శాతం లాభంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.42 శాతం లాభంతో కొనసాగుతుండటంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 12వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 9,365 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు వరుసగా 14వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 12,593 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PC) 0.75 నుంచి 1.03 కి చేరింది. పీసీఆర్ ఒకటిపైన ఉండడం మార్కెట్‌లో ఏర్పడిన బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తుంది.
- విక్స్ 4.6 శాతం తగ్గి 21.6 వద్ద ఉంది. విక్స్ 18 పైన ఉండటం మార్కెట్‌లో ఒడుదుడుకుల తీవ్రతను సూచిస్తోంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలపడి 92.42 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్(Crude oil) ధర బ్యారెల్‌కు 102.57 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
- భారత్‌లో నిరుద్యోగిత రేటు జనవరిలో 5 శాతం ఉండగా.. ఇది ఫిబ్రవరికి 4.9 శాతానికి తగ్గింది.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

