అక్షరటుడే, వెబ్‌డెస్క్: VIVO T5x 5G | చైనాకు (China) చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ (Smartphone) తయారీ కంపెనీ అయిన వివో మరో మోడల్ ఫోన్‌ను తీసుకువచ్చింది. టీ5ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను మంగళవారం (మార్చి 17న) భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈనెల 24 మధ్యాహ్నం 12 గంటలనుంచి సేల్ అందుబాటులో ఉండనుంది. దీనిని గతేడాది విడుదలైన వీవో టీ4 ఎక్స్ కు అడ్వాన్స్డ్ వర్షన్‌గా తీసుకువచ్చారు. బాక్స్‌లో ఫోన్‌తోపాటు చార్జర్, యూఎస్‌బీ కేబుల్, ఫోన్ కేస్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
VIVO T5x 5G | 6.76 ఇంచ్ డిస్‌ప్లే..
డిస్‌ప్లే : 6.76 ఇంచ్ ఏపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2344 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.
ఐపీ68/ ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.
VIVO T5x 5G | టర్బో ఆక్టా కోర్ ప్రాసెసర్
సాఫ్ట్‌వేర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్.. ఫన్ టచ్ ఓఎస్ 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
10 లక్షల అంటుటు స్కోర్ ఉంది.
VIVO T5x 5G | 50 మెగా పిక్సెల్ కెమెరా
కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ హెచ్ డీ ఏఐ పవర్డ్ మెయిన్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ టెలీ ఫొటో లెన్స్ తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్ అప్ ఇచ్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరాలతో 4కే వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
బ్యాటరీ సామర్థ్యం : 7200 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్.. 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. రివర్స్ చార్జింగ్ సౌలభ్యమూ ఉంది. బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే 40 గంటల వీడియో ప్లేబ్యాక్, 93 గంటలపాటు మ్యూజిక్ ప్లేబ్యాక్, 18 గంటలపాటు సోషల్ మీడియ స్క్రోలింగ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ ఆరేళ్లపాటు మన్నుతుందని పేర్కొంటోంది.
VIVO T5x 5G | వేరియంట్స్..
సైబర్ గ్రీన్, స్టార్ సిల్వర్ కలర్స్‌లో మూడు వేరియంట్‌లలో తీసుకువచ్చారు.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999.
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,999.
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999.
కార్డ్ ఆఫర్స్ : ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్‌తోపాటు రూ. 1,500 తక్షణ డిస్కౌంట్ లభించనుంది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ మార్చి 24 సాయంత్రం 6.29 వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి..: Lava Bold 2 5G | పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో ఫోన్

