అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA Land Protection | ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నగరంలోకి కొండాపూర్ (Kondapur), ప్రగతి నగర్‌లో మంగళవారం రూ.1,650 కోట్లు విలువ చేసే 11 ఎకరాల భూమిని కాపాడింది.
హైడ్రా అధికారులు (Hydraa Officers) ఆక్రమణల తొలగింపు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ సెంట్రల్ పార్క్ కాలనీలో పబ్లిక్ పార్క్ కోసం కేటాయించిన 2 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక్కడ 148 ప్లాట్లతో 16 ఎకరాల విస్తీర్ణంలో 1998లో లే అవుట్ వేశారు. ఇందులో పార్క్ కోసం 2 ఎకరాలు కేటాయించారు. మున్సిపల్ అధికారులు (Municipal Officers) గతంలో పార్క్ చుట్టూ ప్రహరీ నిర్మించారు. అయినా కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించారు.
HYDRAA Land Protection | ఫిర్యాదు రావడంతో..
పార్క్ ఆక్రమణపై హైడ్రా ప్రజావాణి (Hydraa Prajavani)లో ఫిర్యాదు అందింది. దీంతో హైడ్రా సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. అది పార్క్ భూమిగా గుర్తించారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) ఆదేశాల మేరకు, మంగళవారం ఉదయం ఆ భూమిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. 2 ఎకరాల ప్రాంతానికి కంచె వేశారు.
HYDRAA Land Protection | ప్రగతి నగర్‌లో
కూకట్‌పల్లి మండలం బాఘమేరి గ్రామం (Baghameri Village) అంబీర్ సరస్సును ఆనుకుని ఉన్న ప్రగతి నగర్‌లోని 9 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా రక్షించింది. ఈ భూమిలో 5 ఎకరాలు శ్మశానవాటికకు, 4 ఎకరాలు డంపింగ్ యార్డ్‌కు గతంలో కేటాయించారు. అయితే కొందరు ఆ భూమిని ఆక్రమించే యత్నం చేశారు. దీంతో హైడ్రా మొత్తం 9 ఎకరాల విస్తీర్ణం చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. ఆ భూమిని శ్మశానవాటిక, ప్రభుత్వ డంపింగ్ యార్డ్‌గా కేటాయిస్తున్నట్లు సూచించే బోర్డులను ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి..: LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్‌పై దాడి.. 36 మంది అరెస్ట్

