అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Kendriya Vidyalaya Sections | నిజామాబాద్ (Nizamabad), బోధన్ కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లను మంజూరు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
దీంతో కొన్ని రోజులుగా ఆయా విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు చేయాలని ఎంపీ అర్వింద్ (MP Arvind) చేసిన కృషి ఫలించినట్లయ్యింది. ఆయన కృషితో ప్రస్తుతం అదనపు సెక్షన్ల మంజూరుతో పాటు ఇంటర్ ఫస్టియర్‌లో సైతం సీట్లను కేటాయిస్తూ కేవీఎస్ నిర్ణయం తీసుకుంది.
Kendriya Vidyalaya Sections | రెండవ తరగతి నుంచి 5వ తరగతి వరకు..
బోధన్ కేంద్రీయ విద్యాలయం (Bodhan Kendriya Vidyalaya)లో రెండో తరగతి నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు మంజూరయ్యాయి. అలాగే నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఇంటర్ ప్రథమ సంవత్సరం సైన్స్‌కు సైతం అనుమతి లభించింది. దీంతో తరగతి 40 చొప్పున మొత్తం 320 మంది విద్యార్థులకు సీబీఎస్సీ విధానంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.

Kendriya Vidyalaya Sections | అదనపు సిబ్బంది నియామకానికి సైతం..
అదేవిధంగా.. రెండు కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకానికి సైతం మార్గం సుగమమైంది. ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అడ్మిషన్ సమస్యలకు కూడా ఉపశమనం కలిగించనుంది. మరింత మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా మార్గం దొరికింది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలపుతున్నారు.
Kendriya Vidyalaya Sections | ఆనందంగా ఉంది..: ఎంపీ అర్వింద్
ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్ల మంజూరు కోసం కేంద్ర మంత్రికి, ఉన్నతాధికారులకు గతంలోనే విన్నవించానని, ఈ ఏడాది నుండి అదనపు సెక్షన్లు మంజూరవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం నా ప్రాధాన్యత అని పేర్కొన్నారు. విద్యాలయాల్లో సౌకర్యాల విస్తరణ కోసం నా ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య

