Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jeevan Reddy Sanjay Clash | మా పార్టీలో చిచ్చు పెట్టిందే ఎమ్మెల్యే సంజయ్​ : మాజీ మంత్రి జీవన్​రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Jeevan Reddy Sanjay Clash | మా పార్టీలో చిచ్చు పెట్టిందే ఎమ్మెల్యే సంజయ్​ : మాజీ మంత్రి జీవన్​రెడ్డి

తెలంగాణకరీంనగర్

Jeevan Reddy Sanjay Clash | మా పార్టీలో చిచ్చు పెట్టిందే ఎమ్మెల్యే సంజయ్​ : మాజీ మంత్రి జీవన్​రెడ్డి

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​పై మాజీ మంత్రి జీవన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 3:30 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Jeevan Reddy Sanjay Clash

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jeevan Reddy Sanjay Clash | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ (MLA Sanjay)పై మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు జీవన్​రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే ఆఫర్ ఇచ్చారన్నారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

Contents
  • Jeevan Reddy Sanjay Clash | నిర్ణయం తీసుకుంటా..
    • Jeevan Reddy Sanjay Clash | సంజయ్​ రావడంతోనే..

సంజయ్​ బీఆర్ఎస్‌లో ఉన్నారని స్పీకర్ అంటున్నారని,కాంగ్రెస్‌లో కలిసి పనిచేయాలని ఆయన అంటున్నారని జీవన్​రెడ్డి పేర్కొన్నారు. తనకు ఆఫర్​ ఇవ్వడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. తాను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానా అన్నారు. పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణం సంజయ్ కాదా అన్నారు. తమ పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టింది సంజయ్ అని విమర్శించారు.

Jeevan Reddy Sanjay Clash | నిర్ణయం తీసుకుంటా..

జగిత్యాల (Jagtial) కాంగ్రెస్​లో కొంతకాలంగా విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే సంజయ్​, మాజీ మంత్రి జీవన్​రెడ్డి మధ్య పొసగడం లేదు. పార్టీ అధిష్టానం జీవన్​రెడ్డిని పక్కన పెట్టి, బీఆర్​ఎస్​ నుంచి పార్టీలో చేరిన సంజయ్​కు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో పలుమార్లు బహిరంగంగానే విమర్శించారు. అయినా పార్టీ పెద్దలు ఆయన మాటలు పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్​ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సంజయ్​ మాట్లాడుతూ.. తనతో కలిసి పనిచేయాలని జీవన్​రెడ్డిని కోరారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు గౌరవం లభించనప్పుడు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. దాని ప్రభావం ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుందన్నారు.

Jeevan Reddy Sanjay Clash | సంజయ్​ రావడంతోనే..

తనకు కాంగ్రెస్​తో 4 దశాబ్దాల అనుబంధం ఉందని జీవన్​రెడ్డి తెలిపారు. ఎంత ఒత్తిడి ఉంటే పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటానో ఆలోచించాలన్నారు. సంజయ్​ కాంగ్రెస్​లోకి రావడంతోనే పార్టీలో చిచ్చు రేగిందని ఆరోపించారు. కాగా జీవన్​రెడ్డి త్వరలో బీఆర్​ఎస్​ (BRS)లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్​ ఫ్లెక్సీలను అనుచరులు తొలగించారు. ఉగాది, రంజాన్​ తర్వాత అనుచరులతో చర్చించి పార్టీ మార్పుపై ప్రకటన చేస్తానని జీవన్​రెడ్డి తెలిపారు.

దీనిని కూడా చదవండి : HYDRAA Land Protection | 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

Cyber Fraud | మాజీ ప్రొఫెసర్​కు సైబర్​ నేరగాళ్ల టోకరా.. రూ.కోటి స్వాహా
Jeevan Reddy Birthday | ఘనంగా జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు..
SI caught bribery | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం
Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి చర్యలు
TAGGED:BRS politicsCongress TelanganaJagityal newsJeevan Reddyparty conflictpolitical clashSanjay MLATelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Municipal Workers Protest Municipal Workers Protest | మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయం ముట్టడి.. సొమ్మసిల్లిన పలువురు కార్మికులు
Next Article ASHA Workers Protest | ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?