అక్షరటుడే, ఎల్లారెడ్డి: KTR False Allegations | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ అసత్య (ktr false allegations) ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే మదన్ మెహన్ (madan mohan mla) అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడారు.
KTR False Allegations | ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిపై..
ఎల్లారెడ్డి నియోజకవర్గంపై (Yellareddy news)కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్మోహన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (telangana politics) వచ్చిన రెండున్నరేళ్లలో ఎల్లారెడ్డిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. అలాంటిది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ నియోజకవర్గంపై (congress vs brs) వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు.
12 వార్డుల్లో 11 వార్డులు కాంగ్రెస్‌వే..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీని (Yellareddy municipal elections) కాంగ్రెస్ కైవసం చేసుకుందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న(political news india) అభివృద్ధిని చూసిన ప్రజలే ఓట్లేసి మున్సిపాలిటీని కాంగ్రెస్‌కు కట్టబెట్టారన్నారు. అలాంటిది కేటీఆర్ మాయమాటలు చెబితే ఇక్కడ నమ్మేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. 12 వార్డులలో 11 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకుందని.. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తూ ఎల్లారెడ్డి ప్రజలు స్పష్టమైన తీర్పును గుర్తుచేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్ గల్లంతైనప్పటికీ ఏం చూసుకుని కేటీఆర్ మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారు ఇప్పుడు అసత్య ప్రచారాలతో రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Kendriya Vidyalaya Sections | కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు.. ఫలించిన ఎంపీ అర్వింద్ కృషి..

