అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market Gains | చైనా, జపాన్ మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు (Stock Markets) మంగళవారం లాభాల బాటలో పయనించాయి. దీని ప్రభావం మన మార్కెట్‌పైనా కనిపించింది. అయితే రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యాయి.
కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తున్న ఇన్వెస్టర్లు.. కాస్త పెరగ్గానే ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో లాభనష్టాల మధ్య ఊగిసలాట కనిపించింది. చివరికి ప్రధాన సూచీలు వరుసగా రెండోరోజూ లాభాలతో ముగిశాయి.
Indian Stock Market Gains | లాభాలతో ప్రారంభమై..
బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు (Nifty) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 324 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 502 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకుని 690 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 147 పాయిట్లు పడిపోయింది. తిరిగి కోలుకుని కనిష్టాల వద్దనుంచి 231 పాయింట్లు పెరిగింది. అయితే గరిష్టాల వద్ద నిýదొక్కుకోలేక కొంతసేపటికే నష్టాల్లోకి జారుకున్నా.. మధ్యాహ్నం తర్వాత తిరిగి కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకుని పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 567 పాయింట్ల లాభంతో 76,070 వద్ద, నిఫ్టీ 172 పాయింట్ల లాభంతో 23,581 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market Gains | ఎఫ్ ఎంసీజీ, ఐటీ మినహా..
ఐటీ,(IT) ఎఫ్ఎంసీజీ (FMCG) రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.97 శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.75 శాతం నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ 2.82 శాతం, ఆటో 2.11 శాతం, రియాలిటీ 1.80 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.40 శాతం, టెలికాం 1.24 శాతం లాభాలతో ముగిశాయి.
Indian Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ (BSE) లో నమోదైన కంపెనీలలో 2,362 కంపెనీలు లాభపడగా 1,892 స్టాక్స్ నష్టపోయాయి. 157 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 56 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 440 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 14 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top gainers: బీఎస్ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 5.70 శాతం, టాటా స్టీల్ 4.41 శాతం, ఎంఅండ్ ఎం 2.91 శాతం, బీఈఎల్ 2.39 శాతం, ఎల్‌టీ 2.29 శాతం లాభపడ్డాయి.
Top losers: ఇన్ఫోసిస్ 1.37 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.17 శాతం, ఐటీసీ 1.05 శాతం, టీసీఎస్ 0.69 శాతం, అదానిపోర్ట్స్ 0.65 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట

