Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Renault Duster 2026 | నయా లుక్‌తో రెనో డస్టర్ రీ ఎంట్రీ.. ధర రూ.10.49 లక్షల నుంచి ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Renault Duster 2026 | నయా లుక్‌తో రెనో డస్టర్ రీ ఎంట్రీ.. ధర రూ.10.49 లక్షల నుంచి ప్రారంభం

బిజినెస్​

Renault Duster 2026 | నయా లుక్‌తో రెనో డస్టర్ రీ ఎంట్రీ.. ధర రూ.10.49 లక్షల నుంచి ప్రారంభం

భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన మిడ్‌సైజ్ ఎస్‌యూవీ రెనో డస్టర్ మరోసారి తన అభిమానుల ముందుకు వస్తోంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 17, 2026 5:00 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Renault Duster 2026

అక్షరటుడే, వెబ్​డెస్క్: Renault Duster 2026 | భారత్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) సరికొత్త హంగులతో మళ్లీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 2026 డస్టర్‌ను రెనో ఇండియా మంగళవారం(మార్చి 17న) లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 10.49 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా బుక్ చేసుకున్నవారికి రూ. 20 వేల డిస్కౌంట్‌తో రూ. 10.29 లక్షలకే విక్రయిస్తున్నారు.

Contents
  • Renault Duster 2026 | ఐబ్రో స్టైల్ ఎలఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు
    • Renault Duster 2026 | ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైప్-సి ఛార్జింగ్
      • Renault Duster 2026 | 360 డిగ్రీల కెమెరా
  • Renault Duster 2026 | ఎవరితో పోటీ అంటే..

మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, టెక్నో ప్లస్, ఐకానిక్ వేరియంట్లలో రెనో డస్టర్ లభ్యమవుతుంది. ఫీచర్లు, ఇంజిన్ ఆప్షన్ల ఆధారంగా రూ.18.49 లక్షల వరకు వివిధ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కాగా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. త్వరలో డెలివరీలు ఇవ్వనున్నారు. ఈ కారు స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.

Renault Duster 2026 | ఐబ్రో స్టైల్ ఎలఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు

ఇందులో హెడ్‌ల్యాంప్ డిజైన్ పూర్తిగా మార్చారు. ముందు భాగంలో ఐబ్రో స్టైల్ ఎలఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ఇవి టర్న్ ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి. రీడిజైన్ చేసిన గ్రిల్ పై ‘డస్టర’ అక్షరాలను స్పష్టంగా ప్రింట్ చేశారు. సిల్వర్ యాక్సెంట్లతో కూడిన బంపర్, పిక్సెల్ స్టైల్ ఫాగ్ లాంప్స్ దీనికి మోడర్న్ లుక్ ఇస్తాయి. వెనుక వైపు డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది.18 ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, 212 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌తో రగ్గ్‌డ్ లుక్‌తో రెనాల్డ్ డస్టర్ ఎక్స్‌యూవీ కనిపిస్తోంది. ఇండియన్ యూజర్ల కోసం ప్రీమియం క్యాబిన్ ఎక్స్‌పీరియన్స్‌తో రూపొందించారు.

Renault Duster 2026 | ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైప్-సి ఛార్జింగ్

కారు లోపలి భాగంలో డ్యూయల్ స్క్రీన్ లే ఔట్, థ్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. ఇవి క్యాబిన్‌కు ప్రీమియం లుక్ ఇస్తాయి.సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్ వంటి ఫీచర్లు టాప్ నాచ్ గా ఉన్నాయని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ (గూగుల్ బిల్ట్ ఇన్), 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, మరియు వెంటిలేటెడ్ సీట్లున్నాయి.

Renault Duster 2026 | 360 డిగ్రీల కెమెరా

యాంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్టార్ట్/ స్టాప్‌కు పుష్ బటన్ వంటి సదుపాయాలు ఇచ్చారు.
సెక్యూరిటీ పరంగా ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360 డిగ్రీల కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సర్లు, నాలుగు వీల్స్‌కు డిస్క్‌బ్రేకులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లు ఉన్నాయి.రెనాల్ట్ మూడు రకాల ఇంజిన్లను పరిచయం చేస్తోంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్, 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

1.0 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 100 బీహెచ్‌పీ, 160 ఎనఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్‌పీ, 280 ఎనఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.1.8 లీటర్ ఫోర్ సిలిండర్ డైరెక్ట్ ఇంజక్షన్ పెట్రోల్ ఇంజిన్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో వస్తోంది. ఇది 160 బీహెచ్‌పీ, 172 ఎనఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.భారత్‌లో టర్బో పెట్రోల్ వేరియంట్ల డెలివరీలు ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ఈ ఏడాది దీపావళి నాటికి అందుబాటులోకి రానుంది.

Renault Duster 2026 | ఎవరితో పోటీ అంటే..

అత్యాధునిక డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన ఈ కారు.. మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకీ విక్టోరిస్, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు

Banking Trust | భారతీయ బ్యాంకింగ్ రంగంలో మారుతున్న విశ్వసనీయత ప్రమాణాలు
Fortune Atta | ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ పిండి ఉత్పత్తుల శ్రేణి విస్తరణ.. ‘ఫార్చ్యూన్ మల్టీగ్రైన్ అట్టా’ విడుదల
March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Tecno Pop X | బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్..
Crude Oil Prices | కలవరపెడుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు
TAGGED:car launch indiaduster new model indiaduster specsmid size suvrenault cars indiaRenault Duster 2026suv cars indiasuv comparison india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Weekly Finance Scam Weekly Finance Scam | వీక్లీ ఫైనాన్స్ వడ్డీ ముఠా సభ్యుల అరెస్ట్..
Next Article GVCC Cricket Championship GVCC Cricket Championship | 3వ జీవీసీసీ క్రికెట్ ఛాంపియన్‌షిప్.. ఆర్కిటెక్ట్‌లు డిజైనర్ల కలయిక
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?