Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Moinabad Drugs Case | మొయినాబాద్​ డ్రగ్స్​ కేసు విచారణకు సిట్​ ఏర్పాటు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Moinabad Drugs Case | మొయినాబాద్​ డ్రగ్స్​ కేసు విచారణకు సిట్​ ఏర్పాటు

తెలంగాణ

Moinabad Drugs Case | మొయినాబాద్​ డ్రగ్స్​ కేసు విచారణకు సిట్​ ఏర్పాటు

మొయినాబాద్​ డ్రగ్స్​ కేసు విచారణకు ప్రభుత్వం సిట్​ ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్​రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 7:09 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Moinabad Drugs Case

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Moinabad Drugs Case | రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్  డ్రగ్స్​ కేసు విచారణకు ప్రభుత్వం సిట్​ ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్​రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డ్రగ్స్​, అక్రమ ఆయుధాలు, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సిట్‌కు బాధ్యతలు అప్పగించారు. మూడు నెలల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.

Contents
  • Moinabad Drugs Case | సిట్‌లోని అధికారులు వీరే..
    • Moinabad Drugs Case | రోహిత్​రెడ్డికి రిమాండ్​

రంగారెడ్డి (Rangareddy) జిల్లా మొయినాబాద్​లో బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్​రెడ్డి (Pilot Rohit Reddy), టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్​, పలువురు వ్యాపారులు డ్రగ్స్​ పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. పార్టీలోని వారికి డ్రగ్స్​ పరీక్షలు చేయగా.. మాజీ ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి, ఎంపీ పుట్ట మహేశ్​ (MP Putta Mahesh)కు పాజిటివ్ వచ్చింది. ఈ కేసులో కీలక వ్యక్తులు ఉండటంతో విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్​కు ఫ్యూచ్​ర్​ సిటీ కమిషనర్​ సుధీర్​ బాబు (Sudheer Babu) నేతృత్వం వహించనున్నారు.

Moinabad Drugs Case | సిట్‌లోని అధికారులు వీరే..

సిట్​లో శాంతిభద్రతలు, గ్రేహౌండ్స్, ఈగల్​ టీమ్​కు చెందిన అధికారులు ఉన్నారు. చేవేళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, గ్రేహౌండ్స్​ గ్రూప్​ కమాండర్​ ఎం. రవీందర్ రెడ్డి, షాద్​నగర్​ డీసీపీ శిరీష, ఈగల్​ టీమ్​ డీఎస్పీలు హరీష్​చంద్రరెడ్డి, ఎన్ బుచ్చయ్య, మొయినాబాద్​ ఎస్​హెచ్​వో వై మల్లికార్జున రెడ్డి, మోకిల ఎస్సై కోటేశ్వరరావు, మొయినాబాద్​ ఎస్సై వెంకన్న, శంషాబాద్​ రూరల్ ఎస్సై సదాత్ అలీ సిట్​లో సభ్యులుగా ఉన్నారు.

drugs case

Moinabad Drugs Case | రోహిత్​రెడ్డికి రిమాండ్​

ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, నేరం మూలాలను కనుగొనాలని డీజీపీ ఆదేశించారు. పెద్ద డ్రగ్ నెట్‌వర్క్‌లతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేసేటప్పుడు అత్యున్నత ప్రమాణాలను పాటించాలని సూచించారు. కాగా ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మరో ఇద్దరికి కోర్టు రిమాండ్​ విధించిన విషయం తెలిసిందే. రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమిత్ శర్మలకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్​ విధించింది. కాగా ఫామ్​హౌస్​లో దాడి చేసిన పోలీసులు ఒక మహిళతో సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎంపీ పుట్ట మహేష్ కుమార్​తో పాటు మరో ఏడుగురికి బెయిల్ వచ్చింది.

దీనిని కూడా చదవండి : Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ

Sircilla Weavers Dues | నేత కార్మికుల విద్యుత్​ బకాయిలు రద్దు చేయాలి : కేటీఆర్​
Telangana Budget Approval | తెలంగాణ బడ్జెట్​కు కేబినెట్​ ఆమోదం
Tadbund Hanuman Temple | భజనలు, కీర్తనలు.. జెన్​జీ కి శనివారం నైట్​ హబ్​గా తాడ్​బండ్​ హనుమాన్​ సన్నిధి!
Kulsum Pura ACP Tirupati | కుల్సుంపురా ఏసీపీగా తిరుపతి బాధ్యతల స్వీకరణ
Strengthening Gram Panchayats | గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం : మంత్రి పొంగులేటి
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Leopard claws case | Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
Next Article Nizamabad fire accident | Nizamabad fire accident | నగరంలో భారీ అగ్నిప్రమాదం.. కాలనీవాసుల భయాందోళన
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?