అక్షరటుడే, న్యూఢిల్లీ: India UAE Talks | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు Sheikh Mohamed bin Zayed Al Nahyanతో భారత ప్రధాని Narendra Modi ఫోన్‌లో మాట్లాడారు. ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు కాసేపు మాట్లాడుకున్నారు. మధ్యప్రాచ్యంలోని తాజా పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.
India UAE Talks | దాడులు శాంతి భద్రతలకు విఘాతం
ఇటీవల యూఏఈపై జరిగిన దాడులను భారత సర్కారు తీవ్రంగా ఖండించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ప్రజల ప్రాణనష్టం, పౌర మౌలిక సదుపాయాల విషయంలో జరిగిన నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు ప్రాంతీయ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.
Strait of Hormuz ద్వారా సురక్షితమైన, అంతరాయం లేని సముద్ర రవాణా ఎంత ముఖ్యమో ఇరువురు నాయకులు చర్చించారు. ఈ మార్గం ప్రపంచ వాణిజ్యానికి కీలకమైనదిగా భావించబడుతున్న నేపథ్యంలో, దీని భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.
India UAE Talks | కలిసి పనిచేయాలని..
మధ్యప్రాచ్యంలో శాంతి, భద్రత, స్థిరత్వాల పునరుద్ధరణ కోసం భారత్–యూఏఈ దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉందని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు.

