Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: March 18 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - March 18 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

బిజినెస్​తాజా వార్తలు

March 18 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

గ్లోబల్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Naresh chandan
Last updated: మార్చి 18, 2026 8:40 ఉద.
Naresh chandan
1 వారం ago
Share
March 18 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ
March 18 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్ లో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: March 18 Pre Market Analysis | గత సెషన్‌లో యూఎస్(US), యూరోపియన్ మార్కెట్లు లాభాలతో ముగియగా.. బుధవారం ఉదయం ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాటలో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Contents
  • March 18 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
    • March 18 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
      • ఆసియా మార్కెట్లు..
      • గమనించాల్సిన అంశాలు..

March 18 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.47 శాతం, ఎస్ అండ్ పీ 0.25 శాతం పెరిగాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ సైతం 0.38 శాతం లాభంతో ఉంది.

March 18 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.83 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.70 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.48 శాతం లాభపడ్డాయి.

ఆసియా మార్కెట్లు..

చైనా మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 3.61 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.22 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.54 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.70 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.08 శాతం లాభాలతో ఉన్నాయి. చైనాకు చెందిన షాంఘై 0.20 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.35 శాతం లాభంతో కొనసాగుతుండటంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా 13వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,741 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 15వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 5,225 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.09 నుంచి 1.03కి పడిపోయింది. పీసీఆర్ ఒకటిపైన ఉండటం మార్కెట్‌లో ఏర్పడిన బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తోంది.
  • విక్స్(VIX) 8.4 శాతం తగ్గి 19.79 వద్ద ఉంది. విక్స్ 18 కన్నా తక్కువకు వస్తేనే ఒడిదుడుకులు తగ్గే అవకాశాలుంటాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 92.37 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 102.79 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
  • అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తమ దేశ జాతీయ చీఫ్ అలీ లారిజానీ మరణాన్ని ఇరాన్ ధ్రువీకరించింది. దీనిపై ఆ దేశం ఎలా స్పందిస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
  • యూఎస్ ఫెడ్(US Fed) పాలసీ మీటింగ్‌పై అందరి దష్టి ఉంది. ఈ ఏడాది మరో రెండుసార్లు వడ్డీ కోతలు ఉంటాయని యుద్ధానికి ముందు అంతా భావించారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఫెడ్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఇన్వెస్టర్లు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
March 15 Horoscope | అమ్మ వైపు బంధువుల నుంచి ధన సహాయం.. ఇక ఈ రాశుల వారి ఇంట కురవనున్న సిరి సంపదలు!
Anirudh Hyderabad Concert | నేడు హైదరాబాద్​లో అనిరుధ్​ మ్యూజిక్​ కాన్సర్ట్.. ట్రాఫిక్​ ఆంక్షలు
March 21 Horoscope | పాత పెట్టుబడుల ద్వారా లాభాల వర్షం.. ఈ రాశుల వారికి డబ్బుకు ఇక డోకా లేదు!
Karimnagar SI Suicide | కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
TAGGED:Gift Nifty Todayglobal market cuesmarch 18 market analysisnifty outlookPre Market Analysisshare market newsstock market indiatrading updates
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Panchareddy Suresh Panchareddy Suresh | బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్​ మృతి
Next Article Gold Rates India Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?