Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vishnu Copper Naivedyam | విష్ణుమూర్తికి రాగి పాత్రలో నైవేద్యం అంటే ఎందుకు అంత ఇష్టం? పురాణాలు చెబుతున్న అసలు రహస్యం ఇదే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Vishnu Copper Naivedyam | విష్ణుమూర్తికి రాగి పాత్రలో నైవేద్యం అంటే ఎందుకు అంత ఇష్టం? పురాణాలు చెబుతున్న అసలు రహస్యం ఇదే!

లైఫ్​స్టైల్​భక్తి

Vishnu Copper Naivedyam | విష్ణుమూర్తికి రాగి పాత్రలో నైవేద్యం అంటే ఎందుకు అంత ఇష్టం? పురాణాలు చెబుతున్న అసలు రహస్యం ఇదే!

హిందూ ధర్మంలో ప్రతి పేరు వెనుక ఒక పరమార్థం, ప్రతి సంప్రదాయం వెనుక ఒక పురాణ గాథ దాగి ఉంటుంది. 'గుడాకేశుడు' అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మహాభారత వీరుడు అర్జునుడు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 18, 2026 10:52 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Vishnu Copper Naivedyam

అక్షరటుడే,హైదరాబాద్ : Vishnu Copper Naivedyam | హిందూ ధర్మంలో ప్రతి పేరు వెనుక ఒక పరమార్థం, ప్రతి సంప్రదాయం వెనుక ఒక పురాణ గాథ దాగి ఉంటుంది. ‘గుడాకేశుడు’ అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మహాభారత వీరుడు అర్జునుడు.

Contents
  • Vishnu Copper Naivedyam | అర్జునుడు ‘గుడాకేశుడు’ ఎలా అయ్యాడు?
    • Vishnu Copper Naivedyam | రాగి పాత్ర వెనుక ఉన్న గుడాకేశుడి గాథ:
      • Vishnu Copper Naivedyam | రాగి పాత్రలో నైవేద్యం ఎందుకు?
        • Vishnu Copper Naivedyam | జ్యోతిష్య ప్రాముఖ్యత:

అయితే, ఈ పేరుకు కేవలం అర్జునుడితోనే కాకుండా, మనం దైవ కార్యాల్లో వినియోగించే రాగి (Copper)లోహంతో కూడా విడదీయలేని సంబంధం ఉంది. సంకల్ప బలంతో ఇంద్రియాలను ఎలా జయించవచ్చో తెలిపే ఈ విశేషాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

Vishnu Copper Naivedyam | అర్జునుడు ‘గుడాకేశుడు’ ఎలా అయ్యాడు?

మహాభారత కథనం ప్రకారం.. అర్జునుడు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. కిరాత రూపుడైన శివుడితో తలపడిన సమయంలో, అర్జునుడు తన నిద్రను, అలసటను పూర్తిగా నియంత్రించుకుని అచంచలమైన పోరాట పటిమను ప్రదర్శించాడు. అర్జునుడి ఏకాగ్రతకు, నిగ్రహానికి మెచ్చిన ముక్కంటి.. అతడిని ‘గుడాకేశా’ (నిద్రను జయించినవాడు) అని సంబోధించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు విషాదంలో మునిగిపోయినప్పుడు, శ్రీకృష్ణుడు అదే పేరుతో అతడిని పిలిచి, తన అంతర్గత శక్తులను గుర్తు చేస్తూ భగవద్గీతను (Bhagavad Gita)  బోధించాడు. ఆకలి, నిద్ర వంటి ఇంద్రియాలను వశపరుచుకోగల ధీరుడివని పార్థుడిని కార్యోన్ముఖుడిని చేశాడు.

Vishnu Copper Naivedyam | రాగి పాత్ర వెనుక ఉన్న గుడాకేశుడి గాథ:

పురాణాల ప్రకారం.. గుడాకేశుడు అనే మరో రాక్షసుడు ఉండేవాడు. రాక్షస కులంలో జన్మించినా, అతడు అపర విష్ణు భక్తుడు. సుమారు 16 వేల ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసి, స్వామి సన్నిధిలోనే శాశ్వతంగా ఉండిపోయే వరం కోరుకున్నాడు. విష్ణు చక్రం చేతిలోనే తనకు మరణం సంభవించాలని ఆకాంక్షించాడు. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో గుడాకేశుని సంహరించాడు. ఆ సమయంలో అతడి మాంసం ‘రాగి’గా, ఎముకలు ‘వెండి’గా, శరీర మలినాలు ‘కంచు’గా రూపాంతరం చెందాయి.

Vishnu Copper Naivedyam

 

Vishnu Copper Naivedyam | రాగి పాత్రలో నైవేద్యం ఎందుకు?

తన ప్రియ భక్తుడైన గుడాకేశుని కోరిక మేరకు, అతడి శరీరంతో ఏర్పడిన రాగి పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి. ఆ పాత్రలోని నైవేద్యంలో ఎన్ని బియ్యపు గింజలు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు ఆ భక్తుడు వైకుంఠంలో నివసిస్తాడని ప్రతీతి. అందుకే నేటికీ పూజా కార్యక్రమాల్లో రాగి పాత్రలకు అంత ప్రాధాన్యత ఇస్తారు.

Vishnu Copper Naivedyam | జ్యోతిష్య ప్రాముఖ్యత:

ఆధ్యాత్మికంగానే కాకుండా, జ్యోతిష్య శాస్త్ర రీత్యా కూడా రాగికి విశిష్టత ఉంది. రాగిని బుధ గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పాత్రలను వాడటం వల్ల సూర్య దోషాలు, బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సంకల్ప బలంతో మనసును, నిద్రను జయించిన గుడాకేశుని స్ఫూర్తితోనే.. అర్జునుడు అజేయ వీరుడిగా నిలిచాడు.

ఇది కూడా చదవండి..: Pink Coffee Benefits | చూడగానే తాగాలనిపించే ఈ పింక్ కాఫీ.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మామూలుగా లేవుగా!

Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా!
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
March 10 Horoscope | ఈ రాశుల వారికి ఆఫీసులో పెరగనున్న గౌరవం.. శత్రువులు కూడా మిత్రులుగా మారడం ఖాయం!
March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Summer Health Tips | మండుతున్న ఎండలు.. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాపాయం: డాక్టర్​ ఆనంద్​ మాలు
TAGGED:Copper Vessel WorshipGudakesha Storyhindu puranashindu temple ritualsLord VishnuSpiritual Beliefs IndiaVedic TraditionsVishnu DevotionVishnu Naivedyam
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 19 Horoscope | కొత్త తెలుగు సంవత్సరంలో కొత్త కెరీర్.. ఉగాది శుభవేళ కష్టానికి తగిన గుర్తింపు.. ఈ రాశుల వారి కల నెరవేరే సుముహూర్తం ఇదే! March 19 Horoscope | కొత్త తెలుగు సంవత్సరంలో కొత్త కెరీర్.. ఉగాది శుభవేళ కష్టానికి తగిన గుర్తింపు.. ఈ రాశుల వారి కల నెరవేరే సుముహూర్తం ఇదే!
Next Article Parabhava nama Ugadi | పరాభవ నామ ఉగాది 2026.. 60 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న ఈ ఏడాది ప్రత్యేకత ఇదే! Parabhava nama Ugadi | పరాభవ నామ ఉగాది 2026.. 60 ఏళ్ల తర్వాత మళ్లీ వస్తున్న ఈ ఏడాది ప్రత్యేకత ఇదే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?