అక్షరటుడే, కామారెడ్డి : Class 10 exams | కామారెడ్డి జిల్లాలో (Kamareddy District) పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం రెండోరోజు హిందీ పరీక్షలు జరిగాయి. ఆయా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకున్నారు.
Class 10 exams | తనిఖీల తర్వాతే..
విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్షకు అనుమతించారు. జిల్లాలో మొత్తం 13,144 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 13,111 మంది హాజరవ్వగా 33 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా రెండోరోజు 99.75 శాతం హాజరు నమోదైంది.
Class 10 exams | జంగంపల్లిలో కలెక్టర్ తనిఖీ
భిక్కనూరు మండలం (Bhikkanur Mandal) జంగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదోతరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (District Collector Ashish Sangwan) తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ప్రశాంత వాతావరణం, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, పరీక్షలకు హాజరైన విద్యార్థుల హాజరు శాతం, తదితర అంశాలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట డీఈవో రాజు, సంబంధిత విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Navodaya Results | నవోదయ పరీక్ష ఫలితాలు విడుదల.. సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

