Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: ACB Corruption Arrest | ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్​ సీఐ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - ACB Corruption Arrest | ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్​ సీఐ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

తెలంగాణ

ACB Corruption Arrest | ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్​ సీఐ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రామును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడికి బినామీగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 18, 2026 3:27 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
ACB Corruption Arrest

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Corruption Arrest | జగిత్యాల జిల్లాలో ఏసీబీ (ACB) అధికారులు సోదాలుచేశారు. కరీంనగర్ (Karimnagar) అర్బన్ ఎక్సైజ్ సీఐ రామును అరెస్ట్​ చేశారు. అతడి వద్ద పెద్ద ఎత్తున నగలు, రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా సీఐకి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా వ్యవహరించగా.. అతడిని సైతం అరెస్ట్ చేశారు.

Contents
  • ACB Corruption Arrest | రూ.20 లక్షలు స్వాధీనం
    • ACB Corruption Arrest | రెవెన్యూ ఇన్​స్పెక్టర్​

కరీంనగర్​ రూరల్​ ఎక్సైజ్​ సీఐ గుండేటి రాము, జగిత్యాల (Jagtial) జిల్లా మాల్యాల మండలం ఓబులాపూర్​ పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు (SGT) జక్కని వేణును ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశరు. రాము వేములవాడ (Vemulavada) ఎస్​హెచ్​వోగా పని చేసిన సమయంలో తన మాజీ సహోద్యోగి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన వేణు ద్వారా లంచాలు తీసుకున్నాడు. 2022 నుంచి 2024 వరకు యూపీఐ లావాదేవీల ద్వారా ఒక బెల్లం వ్యాపారి నుండి క్రమం తప్పకుండా మామూళ్లు స్వీకరించారు. బెల్లం వ్యాపారి ప్రభుత్వ ఉపాధ్యాయుడికి డబ్బులు పంపించగా.. అతడు సీఐ, అతడి తండ్రి ఖాతాలకు బదిలీ చేసేవాడు.

ACB Corruption Arrest | రూ.20 లక్షలు స్వాధీనం

ఏసీబీ అధికారులు అక్రమ లావాదేవీలను గుర్తించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సీఐ బినామీగా గుర్తించారు. సీఐ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.20 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

ACB Corruption Arrest | రెవెన్యూ ఇన్​స్పెక్టర్​

వికారాబాద్ (Vikarabad) జిల్లా పెద్దెముల్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రిచర్డ్ సైమన్​ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఉన్న శ్రీ గోల్డెన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో ఫిర్యాదిదారుడి నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. భూమి పంచనామా చేసి నివేదిక అందించడానికి ఆర్​ఐ లంచం డిమాండ్​ చేసినట్లు అధికారులు తెలిపారు.

దీనిని కూడా చదవండి :  Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ప్రకటన.. రెండో విడతలో వారికి అవకాశం

Arogyasri Dues Release | ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేస్తున్నాం : సీఎం రేవంత్​రెడ్డి
Kavitha Hunger Strike | కవితకు కొడుకు అండ.. చదువుకునే వయసులోనే రాజకీయాలపై ఫోకస్!
Telangana Nominated Posts | త్వరలో నామినేటెడ్​​ పోస్టుల భర్తీ.. కాంగ్రెస్​ నేతల కీలక భేటీ
Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
Telangana Rain Alert | నేడు రాష్ట్రానికి వర్ష సూచన
TAGGED:ACB arrestAnti corruption bureaubribery newsCorruption Case Indiaexcise CI briberygovernment teacher arrest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article  Car Fire Accident Car Fire Accident | రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..
Next Article Axis Finance Axis Finance | వినియోగదారుల భద్రతకు పెద్దపీట.. ఏఐ మానిటరింగ్‌ను ప్రారంభించిన యాక్సిస్ ఫైనాన్స్
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?