అక్షరటుడే, కామారెడ్డి: Police Investigation Standards | కేసుల దర్యాప్తు, విచారణలో స్టేషన్ రైటర్లు నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో స్టేషన్ రైటర్లు, సీఐలు, డీఎస్పీ కార్యాలయాల రైటర్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Police Investigation Standards | స్టేషన్ రైటర్ల పాత్ర అత్యంత కీలకం
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో స్టేషన్ రైటర్ల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ తెలిపారు. రైటర్ల పనితీరులో నాణ్యత ఉన్నప్పుడే నేరస్తులకు శిక్షలు పడడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కేసుల దర్యాప్తు పటిష్టంగా ఉంటేనే నేరస్తులకు శిక్షలు పడతాయని, తద్వారా సమాజంలో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సీసీటీఎన్ఎస్ (CCTNS)లో కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్‌డేట్ చేయాలని సూచించారు. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరమని, తప్పుడు వాంగ్మూలాలు కేసు దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
Police Investigation Standards | ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ప్రతి కేసులో సాక్ష్యాధారాలు బలంగా ఉండేలా రైటర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినప్పటి నుంచి ఛార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు ప్రతి అంశాన్ని ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం అందించడమే పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పెంచే ప్రధాన అంశమని పేర్కొన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని చెప్పారు. సమావేశంలో ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి (Yellareddy CI Raja Reddy), జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల రైటర్లు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Oil Palm Industry | జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

