Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతును ముంచుతున్న సిండికేట్లు : వేముల ప్రశాంత్ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతును ముంచుతున్న సిండికేట్లు : వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్

Red Sorghum Farmers | ఎర్రజొన్న రైతును ముంచుతున్న సిండికేట్లు : వేముల ప్రశాంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎర్రజొన్న, మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం శాసనసభలో ధ్వజమెత్తారు. జీరో అవర్​లో ఆయన మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: మార్చి 18, 2026 5:36 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Red Sorghum Farmers

అక్షరటుడే, భీమ్​గల్: Red Sorghum Farmers | రాష్ట్రంలో ఎర్రజొన్న, మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) బుధవారం శాసనసభలో ధ్వజమెత్తారు. జీరో అవర్​లో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, రూరల్ నియోజకవర్గాల్లో పండే ఎర్రజొన్న (ఫోడర్ జవార్) కొనుగోళ్లలో వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Contents
  • Red Sorghum Farmers | ​ధర తగ్గించి నిలువునా ముంచుతున్నారు..
    • Red Sorghum Farmers | ​యూరియా కోసం యాప్‌ తిప్పలా?

Red Sorghum Farmers | ​ధర తగ్గించి నిలువునా ముంచుతున్నారు..

గత ఏడాది క్వింటాలుకు రూ.3,800 పలికిన ఎర్రజొన్న ధరను, ఈసారి సాగు విస్తీర్ణం తగ్గినా వ్యాపారులు కుమ్మక్కై రూ. 3,000కు తగ్గించారని ప్రశాంత్​రెడ్డి విమర్శించారు. దీనివల్ల రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున నష్టం వాటిల్లుతోందని, కలెక్టర్ (Collector) వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధర లభించేలా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.500 బోనస్ వెంటనే ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం మద్దతు ధర రూ.2,400 ఉండగా, కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రూ.1,600-1,700 కే అమ్ముకుంటూ ఎకరాకు రూ.32వేల వరకు నష్టపోతున్నారని గణాంకాలతో వివరించారు.

Red Sorghum Farmers | ​యూరియా కోసం యాప్‌ తిప్పలా?

​ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్ విధానం వల్ల యూరియా పంపిణీలో (Urea Supply) తీవ్ర జాప్యం జరుగుతోందని వేముల మండిపడ్డారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు వాడడం రాదు. గతంలో కేసీఆర్ (KCR) హయాంలో ఆటో వాడికి డబ్బులిస్తే పొలం వద్దకే యూరియా వచ్చేది. ఇప్పుడు ఒక రైతు 4 ఎకరాల యూరియా కోసం 6 రోజుల పాటు తిరగాల్సి వస్తోంది’ అని విమర్శించారు. యూరియా స్టాక్స్‌ను మండల కేంద్రాల్లో కాకుండా, ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి

POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..
Intermediate exam fear | ఇంటర్​లో ఫెయిల్​ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య
Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
Farmers Compensation | రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
TAGGED:CollectorKCRRed Sorghum FarmersUrea Supplyvemula prashanth reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bike Theft Gang Bike Theft Gang | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
Next Article SSC Exam Vigilance SSC Exam Vigilance | పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?