Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Doctor Noble Profession | వైద్యుడు కనిపించే దైవం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Doctor Noble Profession | వైద్యుడు కనిపించే దైవం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

నిజామాబాద్

Doctor Noble Profession | వైద్యుడు కనిపించే దైవం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

వైద్యుడు కనిపించే దైవమని, రోగి బాధలో ఉన్నప్పుడు అతనికి కనిపించే మొదటి ముఖం వైద్యుడిదేనని ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 18, 2026 6:00 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Doctor Noble Profession

అక్షరటుడే, కామారెడ్డి: Doctor Noble Profession | వైద్యుడు కనిపించే దైవమని, రోగి బాధలో ఉన్నప్పుడు అతనికి కనిపించే మొదటి ముఖం వైద్యుడిదేనని ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో మెడికల్ విద్యార్థుల ఫేర్‌వెల్ కార్యక్రమంలో ఆయన (Shabbir Ali) పాల్గొన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులను ఘనంగా సన్మానించి, వారికి మెమెంటోలు అందజేశారు.

Contents
  • Doctor Noble Profession | వైద్య విద్యార్థుల జీవితంలో..
    • Doctor Noble Profession | కామారెడ్డిలో చదివిన విద్యార్థులు..
      • త్వరలో ఇండోర్ స్టేడియం పనులు

Doctor Noble Profession | వైద్య విద్యార్థుల జీవితంలో..

ఈ సందర్భంగా షబ్బీర్​ అలీ మాట్లాడుతూ.. నేడు వైద్య విద్యార్థుల జీవితంలో ఒక కీలక మైలురాయి అని, విద్యార్థులు సాధించిన విజయం వారి కుటుంబ సభ్యులు, గురువులు, కామారెడ్డి జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కేవలం ఉద్యోగం చేయడం కాదని, సమాజానికి సేవ చేసే మహోన్నత వృత్తిలోకి అడుగుపెడుతున్నారన్నారు. వైద్యులు (Doctors) తమ వృత్తిలో సేవకు ప్రాధాన్యం ఇవ్వాలని, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఒక చిరునవ్వుతో ఇచ్చే సేవ, ఒక మంచి మాటతో ఇచ్చే ధైర్యం అనేక ప్రాణాలను కాపాడతాయన్నారు.

Doctor Noble Profession | కామారెడ్డిలో చదివిన విద్యార్థులు..

కామారెడ్డిలో (Kamareddy) చదివిన విద్యార్థులు ప్రపంచస్థాయికి ఎదిగే సామర్థ్యం కలవారని, తమ ప్రతిభతో జిల్లాకు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలని షబ్బీర్​ అలీ ఆకాంక్షించారు. వైద్య విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలని, వైద్య శాస్త్రంలో మారుతున్న పరిజ్ఞానాన్ని అలవరచుకోవడం అవసరమని తెలిపారు. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యంగా వైద్య విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు, సంక్షేమ పథకాలను అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్​ వాల్య రాథోడ్, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

త్వరలో ఇండోర్ స్టేడియం పనులు

పట్టణంలోని ఇందిరా స్టేడియం పనులు త్వరలో ప్రారంభం అవుతాయని షబ్బీర్ అలీ తెలిపారు. స్థానిక ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో (R&B Guest House) అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇండోర్ స్టేడియం పనులు చేపట్టడానికి స్థలం తక్కువ కావడంతో విద్యాశాఖ చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) స్థలం మంజూరు కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. పనులు చేపట్టడానికి కావాల్సిన 33 గుంటలు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. త్వరలో పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇండోర్ స్టేడియం పనులు చేపడతామన్నారు. క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు స్టేడియంలో కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో కామారెడ్డి నుంచి గొప్ప క్రీడాకారులు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: SSC Exam Vigilance | పరీక్షల సమయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య

Kotagiri Incident | మద్యం మత్తులో దారుణం.. తల్లిని సజీవదహనం చేసిన కసాయి
Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు
RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి
eNAM 2.0 Technical Issues | ‘ఈ నామ్ 2.0’లో సాంకేతిక ఇబ్బందులు పరిష్కరించండి : ఎంపీ అర్వింద్​
Mobile Theft Arrest | మొబైళ్లు చోరీ చేసిన దొంగ అరెస్ట్
TAGGED:CM Revanth ReddyDoctor Noble ProfessionDoctorsKamareddyR&B Guest HouseShabbir Ali
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Indiramma Housing Scheme Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
Next Article Pancha Reddy Suresh death | Pancha Reddy Suresh death | పంచరెడ్డి సురేష్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: ఎమ్మెల్యే ధన్​పాల్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?