అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Central Cabinet Decisions | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన బుధవారం కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
కేంద్ర మంత్రివర్గం రూ. 33,660 కోట్లతో భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులు, రూ.33,660 కోట్ల భారీ పెట్టుబడుల ప్రోత్సాహం అందించనుంది. ఈ పథకం భారతదేశ తయారీ సామర్థ్యాన్ని వెలికితీసి, దేశ వృద్ధిని ముందుకు నడిపిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) అన్నారు. వ్యాపారం చేసే సౌలభ్యాన్ని కల్పించడమే భవ్య పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ పారిశ్రామిక పార్కులు 100 నుంచి 1,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ఐసీటీ నెట్‌వర్క్‌లు, పరిపాలనా సౌకర్యాలు వంటి కీలక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి వీటికి ఎకరాకు రూ.1 కోటి వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. రాష్ట్రాలు, ప్రైవేట్ రంగంతో కలిసి కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుంది.
Central Cabinet Decisions | జల విద్యుత్ కోసం..
జల విద్యుత్ అభివృద్ధి పథకానికి కేబినెట్ రూ.2,585 కోట్లు కేటాయించింది. సుమారు 1,500 మెగావాట్ల సామర్థ్యం గల చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 2,584.60 కోట్ల కేటాయింపుతో ‘చిన్న జల విద్యుత్ (SHP) అభివృద్ధి పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు కానున్న చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులకు (1-25 మెగావాట్ల సామర్థ్యం) మద్దతు ఇస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇది అనుకూలంగా ఉంటుంది.
Central Cabinet Decisions | పత్తి రైతులకు గుడ్‌న్యూస్

పత్తి రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. 2023-24 పత్తి సీజన్ కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)కు రూ.11,712 కోట్ల కనీస మద్దతు ధర (MSP) నిధులను ఆమోదించింది. 2023–24 సీజన్‌లో దేశవ్యాప్తంగా 114.47 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు అంచనా. 325.22 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయింది. కేంద్ర నిర్ణయంతో సుమారు 7.25 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. అలాగే NH-92 బారాబంకి నుంచి బహ్రైచ్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల నిర్మాణానికి రూ. 6,969 కోట్లు కేటాయించింది.
దీనిని కూడా చదవండి : Delhi Fire Accident | ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

