అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran Gulf War Warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇరాన్–ఇజ్రాయెల్ (Iran-Israel) నిత్యం దాడులు చేసుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలపై సైతం ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఆయా దేశాలోన్ని కీలక చమురు కేంద్రాలకు దూరంగా ఉండాలని ప్రజలు, కార్మికులకు హెచ్చరించింది.
గల్ఫ్ దేశాల్లోని పెట్రో కెమికెల్ సౌకర్యాలపై మరికొన్ని గంటల్లో దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించింది. సౌదీ (Saudi)లోని జుబైల్, సమ్రెఫ్, ఖతార్‌లోని మిసాయిద్, రస్లాఫన్, యూఏఈలోని ఆల్ హాసన్ ఆయిల్ ఫెసిలిటీస్‌పై దాడి చేస్తామని హెచ్చరించింది. ఆయా ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు, సమీప ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే దూరంగా వెళ్లాలని సూచించింది.
Iran Gulf War Warning | ప్రతీకారంగా..
ఇజ్రాయెల్ (Israel) ఇద్దరు సీనియర్ ఇరాన్ భద్రతా అధికారులను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలతో పాటు, ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించింది. సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరిగా పరిగణించబడ్డారు.
జనరల్ ఘోలం రెజా సోలేమానీ, రివల్యూషనరీ గార్డ్ (IRGC) యొక్క స్వచ్ఛంద బసీజ్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. వీరు ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. ఈ ఇద్దరి హత్యలను ఇరాన్ ధ్రువీకరించింది.
Iran Gulf War Warning | దుబాయ్‌పై దాడి
దుబాయ్ (Dubai)పై బుధవారం ఇరాన్ దాడులు చేసింది. ఇరాన్ క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదన్నారు.
యూఏఈలోని ఆస్ట్రేలియా సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో కూడా ఒక ఇరాన్ క్షిపణి పడిందని, అయితే ఎటువంటి గాయాలు సంభవించలేదని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.
దీనిని కూడా చదవండి : Russian Oil Tanker | రూటు మార్చిన రష్యన్ ఆయిల్ ట్యాంకర్.. చైనాకు వెళ్లకుండా భారత్ వైపు రాక

