అక్షరటుడే, వెబ్డెస్క్: Ramzan Holiday Telangana | రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ముస్లిం ఉద్యోగులకు (Muslim Employees Leave) శుభవార్త తెలిపింది. పండగ కంటే ఒకరోజు ముందు ఆప్షనల్ హాలిడే ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
Ramzan Holiday Telangana | 21న రంజాన్ పండుగ..
ఈనెల 21న చంద్రదర్శనం ఆధారంగా రంజాన్ పండుగను ముస్లింలు జరుపుకోనున్నారు. అయితే రంజాన్ మాసం చివరి శుక్రవారం (జమాతుల్ విదా) కావడంలో ముస్లిం ఉద్యోగులు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శుక్రవారం 20తేదీన సెలవు ప్రకటిస్తూ (Optional Holiday India) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Ramzan Holiday Telangana | ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం..
ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం మొదట ప్రభుత్వం ఐచ్చిక సెలవు మార్చి 13న ప్రకటించింది. అయితే చంద్ర దర్శనాన్ని బట్టి ఈ సెలవును మార్చి 20కి మార్చాలని వక్ఫ్ బోర్డు కోరడంతో రాష్ట్ర పరిపాలన శాఖ తేదీని సవరిస్తూ ఉత్తర్వులు జారీ (Government Orders) చేసింది.
తెలంగాణ హైకోర్టు సైతం..
తెలంగాణ హైకోర్టు కూడా మార్చి 20తేదీని సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 21వ తేదీన రంజాన్ పండుగ, మార్చి 22 ఆదివారం కావడంతో రాష్ట్రంలోని చాలామంది (Optional Holiday India) ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవు లభించే అవకాశం ఏర్పడింది.

ఇది కూడా చదవండి: Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో సూచీలు..

