అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Ugadi Celebrations Nizamabad | జిల్లాలో ఉగాది పండుగను భక్తిశ్రద్ధలతో (Nizamabad News) జరుపుకుంటున్నారు. ఇళ్లల్లో కొత్తకుండలో ఉగాది పచ్చడి తయారు చేయడం ఆనవాయితీ. ఇలా తయారుచేసిన పచ్చడిని ఇంటిల్లిపాదికి పంచిపెట్టారు. మామిడితోరణాలతో ప్రత్యేక పూజలతో (Telangana Festivals) ఇళ్లన్ని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Ugadi Celebrations Nizamabad | నవదుర్గ ఆలయంలో టీజీవో ఆధ్వర్యంలో..
జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం(Ugadi Pachadi) వద్ద ఉన్న నవదుర్గ ఆలయంలో(Navadurga Temple) టీజీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ ఆధ్వర్యంలో(Panchangam Event) ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదపండితుడు ప్రవీణ్ పంతులు, ప్రతినిధులకు పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. నవదుర్గ ఆలయ కమిటీ అధ్యక్షుడు, టీజీవో అధ్యక్షుడు అలుక కిషన్, ప్రతినిధుతు అమృత్ కుమార్, నారాయణ రెడ్డి, బుస్సా ఆంజనేయులు, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: IRCTC Summer Tours | సమ్మర్ టూర్‌కు ఐఆర్‌సీటీసీ రెడీ.. హైదరాబాద్ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు

