అక్షరటుడే, వెబ్‌డెస్క్: Snake Hunting Ability | పాము పేరు వింటేనే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. విషపూరితమైనా, కాకపోయినా పాము కనిపిస్తే చాలు ఆమడ దూరం పరుగులు తీస్తాం. అయితే, భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులుగా పేరున్న పాముల గురించి మనకు తెలియని ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాము కంటిచూపు ఎంత? అది తన ఎరను ఎలా వేటాడుతుంది? అనే విషయాలపై శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికర నిజాలను వెల్లడించారు.
Snake Hunting Ability | చూపు మందగించినా.. వేటలో మొనగాళ్లు:
చాలా మంది పాములకు తీక్షణమైన చూపు ఉంటుందని భావిస్తారు. కానీ, వాస్తవానికి పాములకు కంటిచూపు చాలా తక్కువ. ఇవి సాధారణంగా 1 నుంచి 3 మీటర్ల (3 – 10 అడుగుల) దూరం వరకు మాత్రమే స్పష్టంగా చూడగలవు. అయితే, కింగ్ కోబ్రా వంటి పెద్ద జాతి పాములు మాత్రం సుమారు 10 నుంచి 15 మీటర్ల దూరం వరకు చూడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
Snake Hunting Ability | నాలకతోనే వాసన.. కంపనాలతోనే అలికిడి:
కంటిచూపు తక్కువగా ఉన్నప్పటికీ, పాములు ఇతర ఇంద్రియాల ద్వారా వేటను ఇట్టే పట్టేస్తాయి.
నాలక: పాము పదే పదే నాలుకను బయటకు చాచడం గమనించే ఉంటారు. గాలిలోని అణువులను తన నాలక ద్వారా గ్రహించి, ఎర ఎక్కడ ఉందో వాసన ద్వారా పసిగడుతుంది.
కంపనాలు: పాములకు మనలాగా బయటికి కనిపించే చెవులు ఉండవు. కానీ, భూమిలో కలిగే అతి స్వల్ప కంపనాలను (Vibrations) సైతం తన చర్మం ద్వారా గ్రహిస్తాయి. మనుషులు లేదా జంతువులు దరిదాపుల్లోకి వస్తే ఈ కంపనాల ద్వారానే అవి అప్రమత్తమవుతాయి.
హీట్ సెన్సార్లతో వేట:
కొండచిలువలు, పిట్ వైపర్లు వంటి కొన్ని రకాల పాములకు తల భాగంలో ప్రత్యేకమైన హీట్ సెన్సార్లు ఉంటాయి. ఇవి చీకటిలో కూడా ఇతర జీవుల శరీరం నుంచి వెలువడే వేడిని (Heat) గుర్తించగలవు. కళ్లు కనిపించకపోయినా, ఈ ‘థర్మల్ విజన్’ సాయంతో రాత్రిపూట కూడా పాములు కచ్చితత్వంతో దాడి చేయగలవు.
ఇది కూడా చదవండి: High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!

