అక్షరటుడే, గాంధారి: Shadnagar Pond Accident | పండగ పూట విషాదం నెలకొంది. కాళ్లు శుభ్రం చేసుకునేందుకు కొలనులోకి (Pond Accident India) దిగిన ఓ యువకుడు జారిపడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది.
Shadnagar Pond Accident | మండలంలోని నేరల్తండా వాసి..
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాంధారి (Gandhari) మండలంలోని నేరల్‌తండాకు చెందిన బార్దవల్ రాజు(21) షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో (Youth Death Incident) కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనగల పొట్టును డీసీఎంలో లోడ్ చేసుకుని షాద్‌నగర్ వెళ్లారు. అన్లోడ్ చేసిన అనంతరం స్థానికంగా ఉన్న ఓ కొలనులో(Water Accident) కాళ్లు కడుక్కునేందుకు దిగాడు. అయితే కాలుజారి నీళ్లలో పడిపోయి (Festival Tragedy) మృత్యువాత పడ్డాడు. నలుగురు (Local News India) కలిసి కొలను వద్దకు వెళ్లగా రాజు నీటిలో జారిపడ్డాడు. స్థానికుల సాయంతో చివరకు కొలను నుంచి రాజు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని (Police Investigation) దర్యాప్తు చేస్తున్నారు. రాజు మృతి చెందడంతో నేరల్‌తండాలో విషాదం నెలకొంది.
ఇది కూడా చదవండి: Stock Market Crash | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారీ నష్టాల్లో సూచీలు..

