Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Saudi Exit Warning | వెంటనే సౌదీని వీడండి.. పౌరులకు అమెరికా విజ్ఞప్తి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Saudi Exit Warning | వెంటనే సౌదీని వీడండి.. పౌరులకు అమెరికా విజ్ఞప్తి

అంతర్జాతీయం

Saudi Exit Warning | వెంటనే సౌదీని వీడండి.. పౌరులకు అమెరికా విజ్ఞప్తి

రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. అమెరికా పౌరులు వెంటనే సౌదీ అరేబియాను విడిచి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 19, 2026 5:50 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Saudi Exit Warning

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Saudi Exit Warning | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. రోజు రోజుకు దాడులు పెరుగుతుండటంతో యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్  (Iran)​ గల్ఫ్​ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. దీంతో రియాద్‌ (Riyadh)లోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికా పౌరులు వెంటనే సౌదీ అరేబియాను విడిచి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది.

Contents
  • Saudi Exit Warning | విమానాల ద్వారా..
    • Saudi Exit Warning | సూచనలు పాటించాలి

ఇరాన్​ బుధవారం రాత్రి ఖతార్​పై బాంబుల వర్షం కురిపించింది. ఇతర దేశాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో అమెరికా అప్రమత్తం అయింది. ఇప్పటికే ఇరాన్​కు ట్రంప్​ వార్నింగ్​ ఇచ్చారు. మరోసారి ఇలాంటి దాడులు చేస్తే భారీ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో అమెరికా రాయబార కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా పౌరులు సురక్షితంగా వెళ్లగలిగితే సౌదీ అరేబియాను విడిచి వెళ్లడాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరింది.

Saudi Exit Warning | విమానాల ద్వారా..

వాణిజ్య విమానాల ద్వారా సౌదీ అరేబియాను విడిచి వెళ్లాలని అమెరికా పౌరులకు ఎంబసీ తెలిపింది. క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో తరచుగా విమాన రాకపోకలపై ఆంక్షలు ఉంటున్నాయని తెలిపింది. అయితే ప్రస్తుతం సౌదీ గగనతలం తెరిచే ఉందని పేర్కొంది. రియాద్, జెడ్డా, దమ్మామ్ విమానాశ్రయాలు తెరిచే ఉన్నాయని తెలిపింది.

Saudi Exit Warning | సూచనలు పాటించాలి

సౌదీ అరేబియాలోనే ఉండాలని నిర్ణయించుకున్న అమెరికా పౌరులు ఆ దేశం మార్గదర్శకాలను పాటించాలని రాయబార కార్యాలయం కోరింది. అయితే అది సకాలంలో హెచ్చరికలను అందించడంలో నిలకడగా విశ్వసనీయంగా లేదని హెచ్చరించింది. ఇరాన్ ప్రతీకార దాడులకు పదేపదే గురవుతున్న గల్ఫ్ దేశాలలో నెలకొన్న తీవ్రమైన ప్రమాదకర వాతావరణాన్ని ఈ హెచ్చరిక ప్రతిబింబిస్తోంది.

దీనిని కూడా చదవండి : Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!

UAE India Missile Deal | భారత రక్షణ రంగంలో కీలక పరిణామం.. బ్రహ్మోస్​, ఆకాశ్​ కొనుగోలుకు యూఏఈ ఆసక్తి!
Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం
Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్​ వార్నింగ్​
Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం
Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా
TAGGED:Gulf security crisisIran attacks GulfMiddle East conflictSaudi Arabia newsSaudi Exit WarningUS embassy alertUS travel advisory
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article HDFC Bank Share Crash | HDFC Bank Share Crash | కుప్పకూలిన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ షేర్లు..నాయకత్వ మార్పే కారణమా?
Next Article Congress Committee Formation Congress Committee Formation | కాంగ్రెస్​ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?