అక్షరటుడే, ఇందూరు : RSS Role Hindu Society | హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పాత్ర ఎంతో కీలకమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana) అన్నారు. జిల్లా కేంద్రంలోని బస్వాగార్డెన్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు (Ugadi Celebrations) నిర్వహించారు.
ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ… హిందువుల ప్రతి పండుగను, ఆచార వ్యవహారాలను చాటి చెప్పడంలో ఆర్ఎస్ఎస్ (RSS Role Hindu Society) ముందుంటుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో హిందువులు జాగృతమవడమే కాకుండా ఐక్యత పెరుగుతుందన్నారు. కేవలం సేవనే కాకుండా పండుగల విశిష్టతను తెలియజేయడం ఎంతో గర్వనీయమన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ పుట్టినరోజు కూడా ఉగాది రోజునే కావడం ఎంతో విశిష్టమైందన్నారు. అనంతరం పంచాంగ శ్రవణం చేసిన మాకునూరి పురుషోత్తమాచార్యులును సన్మానించారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ జక్కా రవి, తెలంగాణ ప్రాంత సహా బౌద్ధిక్ ప్రముఖ్, ఇందూరు విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
RSS Role Hindu Society | అవినీతిపరులకు పరాభవం తప్పదు

అవినీతిపరులు, అక్రమాలకు పాల్పడే వారికి ఈ ఏడాది పరాభవం తప్పదని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని కిసాన్ గంజ్లో గల ఆర్యవైశ్య సంఘం (పట్టణ) ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దాదాపు 52 ఏళ్లుగా వైశ్య సంఘానికి పంచాంగ శ్రవణం వినడానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
అనంతరం పంచాంగం వినిపించిన వేద పండితులు వేలేటి గౌరీ శంకర్ శర్మను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ 18వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి రాము, బీజేపీ 34 డివిజన్ కార్పొరేటర్ బంటు ప్రవీణ్ (పండు), ఆర్యవైశ్య సంఘం (పట్టణ) అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, గాలి నాగరాజు గుప్తా, లాబిశెట్టి శ్రీనివాస్ గుప్తా, పార్శి మారుతి గుప్తా, సుధాకర్ గుప్తా, రాజా ప్రతాప్ గుప్తా, నేతి మోహన్ గుప్తా పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Congress Committee Formation | కాంగ్రెస్ జిల్లా, నగర కమిటీల ఏర్పాటు

