Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ramzan Holiday in AP | రంజాన్ సెలవు తేదీ మార్పు.. మార్చి 21కు షిఫ్ట్, పదో తరగతి పరీక్ష వాయిదా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Ramzan Holiday in AP | రంజాన్ సెలవు తేదీ మార్పు.. మార్చి 21కు షిఫ్ట్, పదో తరగతి పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్​

Ramzan Holiday in AP | రంజాన్ సెలవు తేదీ మార్పు.. మార్చి 21కు షిఫ్ట్, పదో తరగతి పరీక్ష వాయిదా

రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవు తేదీని మార్చుతూ ఏపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా మార్చి 20న ప్రకటించిన సెలవును, నెలవంక కనిపించకపోవడంతో మార్చి 21కు మార్చింది.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 9:13 ఉద.
Srinivas Kolluri
1 వారం ago
Share
Ramzan Holiday in AP

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramzan Holiday in AP | రంజాన్ పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం (State Government) సెలవు తేదీలో మార్పులు చేసింది. ముందుగా ఈనెల 20వ తేదీ (శుక్రవారం)ను రంజాన్ సాధారణ సెలవుగా ప్రకటించినప్పటికీ, ఆ రోజు నెలవంక కనిపించకపోవడంతో వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు సెలవును ఈనెల 21వ తేదీ (శనివారం)కు మార్చినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ వెల్లడించారు.

ఈ మేరకు జీఓ ఆర్టీ సంఖ్య: 612 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా షాపులు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 ప్రకారం కూడా జీఓ ఆర్టీ సంఖ్య: 613 ద్వారా సెలవు తేదీ మార్పును అమలు చేశారు.

Ramzan Holiday in AP | శుక్ర‌వారం య‌థావిధిగా..

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మార్చి 20వ తేదీన (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు , విద్యాసంస్థలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఇక ఈ మార్పు ప్రభావం పదో తరగతి పరీక్షల (SSC Exams)పై కూడా పడింది. ముందుగా మార్చి 21న జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసి, ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొదట ఈ పరీక్షను మార్చి 20న నిర్వహించాలని షెడ్యూల్ ఉండగా, రంజాన్ సెలవు కారణంగా 21కు మార్చారు. అయితే ఇప్పుడు సెలవు తేదీ మార్పుతో పరీక్షను పూర్తిగా వాయిదా వేయాల్సి వచ్చింది.

ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు  తమ పరీక్షా ప్రణాళికలను అనుగుణంగా మార్చుకోవాలని విద్యాశాఖ (Education Department) సూచించింది.ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ ముందుగానే మార్చి 21న రంజాన్ సెల‌వుగా ప్ర‌క‌టించారు. దీంతో తెలంగాణ‌లో ఎలాంటి మార్పులు లేవు.

ఇది కూడా చదవండి..: Visakhapatnam Firecracker Explosion | విశాఖలో భారీ పేలుడు.. అక్రమంగా నిల్వ చేసిన బాణసంచా పేలి ఇళ్లు ధ్వంసం

Tirumala Forest Fire | తిరుమల కొండల్లో కార్చిచ్చు..
YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​
Ustaad Bhagat Singh Ticket Prices | ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ టికెట్‌ రేట్లు పెంపు
Alipiri Walkers Protest | అలిపిరి మార్గంలో వాకర్ల ఆందోళన.. నగరవనం ప్రవేశ రుసుముపై రాస్తారోకో, ట్రాఫిక్ జామ్
SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!
TAGGED:Education DepartmentRamzan Holiday in APSSC ExamsState Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర! Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!
Next Article Hyderabad Food Adulteration Hyderabad Food Adulteration | కల్తీ మాఫియాపై ఉక్కుపాదం.. ప్రత్యేక బృందం ఏర్పాటు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?