Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: WhatsApp Usernames Feature | వాట్సాప్​ కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రత్యేక ఐడీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

టెక్నాలజీ - WhatsApp Usernames Feature | వాట్సాప్​ కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రత్యేక ఐడీలు

టెక్నాలజీ

WhatsApp Usernames Feature | వాట్సాప్​ కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రత్యేక ఐడీలు

వాట్సాప్​ త్వరలో యూజర్​నేమ్​ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఫోన్​ నంబర్ ఇవ్వకుండానే ఇతరులతో చాటింగ్​ చేసే అవకాశం కల్పించనుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 10:42 ఉద.
Srinivas Kolluri
7 రోజులు ago
Share
WhatsApp Usernames Feature

అక్షరటుడే, వెబ్​డెస్క్ : WhatsApp Usernames Feature | ప్రముఖ మెసెజింగ్ యాప్​ వాట్సాప్​ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్​నేమ్, ప్రత్యేక ఐడీలతో లాగిన్​ అయ్యే విధంగా మార్పులు తీసుకు రానుంది. ప్రస్తుతం ఫోన్​ నంబర్​ ద్వారా వాట్సాప్​ అకౌంట్​ (WhatsApp Account) ఓపెన్​ అవుతుంది. లాగిన్​ కావాలన్న ఫోన్​ నంబర్​తోనే. ఈ క్రమంలో వాట్సాప్​ వినియోగించాలంటే ప్రజలు తప్పనిసరిగా ఫోన్​ నంబర్​ ఇతరులతో పంచుకోవాలి.

Contents
  • WhatsApp Usernames Feature | నంబర్​ ఇవ్వకుండానే..
    • WhatsApp Usernames Feature | వ్యాపార నమూనాలో మార్పు

ఫోన్ నంబర్ల నుంచి యూజర్‌నేమ్‌లు, ప్రత్యేక ఐడీలకు మారడంతో వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌లో అతిపెద్ద మార్పునకు సిద్ధమవుతోంది. ఫోన్ నంబర్లను పంచుకోకుండానే సందేశాలు పంపడానికి, వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయడానికి వీలవుతుందని సమాచారం. 2026 జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా యూజర్‌నేమ్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఫేస్​బుక్​, ఎక్స్​, ఇన్​స్టాగ్రామ్​ (Instagram) వంటి ప్లాట్​ఫామ్​లు యూజర్​నేమ్​, పాస్​వర్డ్​తో లాగిన్​ అయ్యే అవకాశం కల్పించాయి. ఇదే మాదిరిగా వాట్సాప్​ కూడా అమలు చేయనుంది.

WhatsApp Usernames Feature | నంబర్​ ఇవ్వకుండానే..

ప్రజలు తమ ఫోన్ నంబర్లను పంచుకోవాల్సిన అవసరం లేకుండా కొత్త స్నేహితులు, గ్రూపులు, వ్యాపారాలతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడేలా భవిష్యత్తులో వాట్సాప్‌కు యూజర్‌నేమ్‌లను తీసుకురానున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఫీచర్ ప్రజలకు అదనపు గోప్యతను అందిస్తుందన్నారు. వాట్సాప్‌లో వ్యాపారాలను సంప్రదించడాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.

WhatsApp Usernames Feature | వ్యాపార నమూనాలో మార్పు

వాట్సాప్ వ్యాపారాల కోసం ‘డైనమిక్ ప్రైసింగ్'(Dynamic Pricing) ను కూడా తీసుకు రానుంది. వాట్సాప్​ ఇప్పటికే ఛానెల్స్, కమ్యూనిటీలు, స్టేటస్ యాడ్స్ వంటి ఫీచర్ల ద్వారా డబ్బు సంపాదిస్తోంది. వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో చేస్తున్న సమగ్ర మార్పుల ముఖ్య ఉద్దేశ్యం ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం, ఏఐ-ఆధారిత సంభాషణలకు సిద్ధమవ్వడం అని సమాచారం. 50 కోట్లకు పైగా వినియోగదారులతో బ్రెజిల్‌తో పాటు భారతదేశం వాట్సాప్‌కు అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే మార్కెట్లలో ఒకటిగా ఉంది.

ఇది కూడా చదవండి..: White Hair Myth | తెల్ల జుట్టును పీకేస్తే ఎక్కువ అవుతాయా.. అసలు నిజం ఇదే!

iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..
IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్​ తర్వాత ఏమి జరగబోతోంది!
Nothing Phone 4A | కొత్త లుక్‌తో నథింగ్ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
WhatsApp Username Feature | వాట్సాప్‌లో భారీ మార్పు.. ఇకపై ఫోన్ నంబర్ అవసరం లేదు, యూజర్‌నేమ్‌తోనే చాటింగ్!
ఏఐ కంప్యూట్ రంగంలో సంచలనం: ఓఎక్స్ఎంఐక్యూ ల్యాబ్స్ ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ భారీ ఒప్పందం
TAGGED:digital communicationDynamic PricingInstagrammessaging appsprivacy featuressocial media trendstech newsWhatsApp AccountWhatsApp new featureWhatsApp usernamesWhatsApp Usernames Feature
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Sub Collector Saves Woman Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్
Next Article Iran F-35 Incident  Iran F-35 Incident | అమెరికా F-35 విమానాన్ని కూల్చివేసిన ఇరాన్‌
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?