Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: HMPV Virus | అమెరికాపై మరో ప్రమాదకర వైరస్​ పంజా.. వేగంగా విస్తరిస్తున్న HMPV!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - HMPV Virus | అమెరికాపై మరో ప్రమాదకర వైరస్​ పంజా.. వేగంగా విస్తరిస్తున్న HMPV!

అంతర్జాతీయం

HMPV Virus | అమెరికాపై మరో ప్రమాదకర వైరస్​ పంజా.. వేగంగా విస్తరిస్తున్న HMPV!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విధంగా “భయంకరమైన కొత్త వైరస్” కాదని స్పష్టం అవుతున్నప్పటికీ, అమెరికాలో దీని వ్యాప్తి మాత్రం పెరుగుతున్నదనేది నిజం.

Naresh chandan
Last updated: మార్చి 20, 2026 12:13 సా.
Naresh chandan
7 రోజులు ago
Share
HMPV Virus

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: HMPV Virus | అగ్రరాజ్యం అమెరికా (America)కు మరో ముప్పు  పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో కొత్తగా ఒక వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వార్తలు కూడా వెలువడుతున్నాయి.

Contents
  • HMPV Virus | ఎంత వరకు నిజం…
    • HMPV Virus | HMPV అంటే ..
      • HMPV Virus | వ్యాప్తి ఇలా..

సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో ఈ వైరల్ పోస్టులు వైరల్​ అవుతున్నాయి. “చికిత్స లేని ప్రమాదకర వైరస్”గా పేర్కొంటున్న దీని అసలు పేరు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (Human Metapneumovirus). కాగా, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

HMPV Virus | ఎంత వరకు నిజం…

సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్న మ్యాప్స్, వీడియోలను పరిశీలిస్తే.. ఈ వైరస్ అమెరికా మొత్తం వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ మ్యాప్స్ ను అధికారిక సంస్థలు ధ్రువీకరించలేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ వైరస్ వ్యాప్తి నిజమేనని తాజా డేటా వెల్లడిస్తోంది.

HMPV Virus | HMPV అంటే ..

హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ అనేది ఒక శ్వాసకోశ సంబంధిత వైరస్ గా వైద్య నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు కారడం, శ్వాసలో ఇబ్బంది ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో న్యుమోనియా, బ్రాంకైటిస్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు.

HMPV Virus | వ్యాప్తి ఇలా..

దగ్గు, తుమ్ముల ద్వారా గాలిలో ఒక వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తోంది. దీంతోపాటు కలుషిత ఉపరితలాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌కు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ప్రత్యేక వాక్సిన్ లేదు. నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స కూడా లేదు. కేవలం లక్షణాల నియంత్రణపైనే చికిత్స ఆధారపడి ఉంది.

కొవిడ్​ అంత ప్రమాదకరం కాదని చెబుతున్న ఈ వైరస్ ను 2001లోనే గుర్తించారు. ఏటా శీతాకాలం నుంచి వసంతకాలం మధ్య వ్యాపిస్తుంటుంది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉన్న వేస్ట్‌వాటర్ (మురుగు నీటి) పరీక్షల్లో ఈ వైరస్ అధిక స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా సహా పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ విజృంభిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Rupee Falls Against Dollar | మరింత పడిపోయిన రూపాయి విలువ

Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
Colombia Plane Crash | కొలంబియాలో ఘోర విమాన ప్ర‌మాదం.. 80 మందికి పైగా సైనికులు మృతి
Mojtaba Khamenei Iran | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు
Dubai Iran Attacks | దుబాయ్​పై ఇరాన్​ దాడులు.. బుర్జ్​ ఖలీఫా ఖాళీ
ISIS Threat Hindus | దక్షిణాసియాలో హిందువులపై దాడులకు ఐసిస్ పిలుపు.. సీఈపీ నివేదికలో సంచలన వివరాలు
TAGGED:AmericaHMPV VirusHuman MetapneumovirusSocial Media
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Forbes India Billionaires Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం
Next Article Telangana Budget 2026  Telangana Budget 2026 | రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?