అక్షరటుడే, హైదరాబాద్: Rohith Reddy Farmhouse Case | తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు (Moinabad Farmhouse Drugs Case)లో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసును ఎదుర్కొంటున్న రోహిత్ .. తాజాగా ఫామ్‌హౌస్ భూమి వ్యవహారంతో మరోసారి వార్తాల్లో నిలిచారు.
Rohith Reddy Farmhouse Case | అసైన్డ్ ల్యాండ్‌లో ఫామ్ హౌస్..
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ పరిధిలో ఉన్న సర్వే నంబరు 177/33లో సుమారు రెండు ఎకరాల భూమిలో సదరు ఫామ్ హౌస్ నిర్మించారు. కాగా, ఈ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు కీలక అంశాలను గుర్తించారు. ఈ ల్యాండ్‌ను అసలు రికార్డుల్లో “అంతంగారి జంగయ్య” పేరుతో ఉన్న అసైన్డ్ భూమిగా అధికారులు గుర్తించినట్లు సమాచారం.
కాగా, అదే భూమిలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫౌమ్‌హౌస్ (Rohith Reddy Farmhouse)ను తన తండ్రి విఠల్ రెడ్డి పేరుతో నిర్మించి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు నిర్ధారించినట్లు తెలిసింది. అసైన్డ్ భూమిని ఇతరులకు బదిలీ చేయడం కానీ, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం కానీ చట్ట విరుద్ధం.
ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ భూమి ఎలా బదిలీ అయింది? ప్రస్తుతం ఎలాంటి పత్రాలు ఉన్నాయి? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. అవసరమైతే ఫామ్ హౌస్‌ను సీజ్ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
Rohith Reddy Farmhouse Case | ఇప్పటికే డ్రగ్స్ కేసు..
ఇటీవలే ఈ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కేంద్రంగా నిలిచింది. పోలీసులు నిర్వహించిన దాడిలో మాజీ ఎమ్మెల్యేతో సహా పలువురు డ్రగ్స్ పట్టుబడ్డారు. దీనికితోడు పోలీసుల దాడి సమయంలో గన్ ఫైరింగ్ జరగడం తీవ్ర సంచలనంగా మారింది. వరుస వివాదాలు బీఆర్ఎస్ (BRS)కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావొచ్చని పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Rohith Reddy Farmhouse Case | SIT విచారణ
ఫామ్ హౌస్ డ్రగ్స్ వినియోగం ఘటనకు రాజకీయ కోణం ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team) అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కాల్పుల ఘటనలో ప్రేరేపణ ఆరోపణలు సైతం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..: Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్ల నియామకం

