అక్షరటుడే, వెబ్డెస్క్: ATC Student Scholarship | రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీల్లో చదువుతున్న విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న వారికి నెలకు రూ. 2 వేల స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు.
డిప్యూటీ సీఎం భట్టి రూ.3,24,234 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. పశు సంవర్థక శాఖకు 1,529కోట్లు. విద్యుత్ శాఖకు 21,285 కోట్లు కేటాయింపులు చేశారు. రాష్ట్రంలోని 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల 2 వేల స్కాలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. కొత్త కోర్సులను సైతం ప్రవేశ పెట్టారు. విద్యార్థులకు త్వరగా ఉపాధి లభించేలా కోర్సులు రూపొందించారు. దీంతో వీటిల్లో చేరడానికి విద్యార్థులు (Students) ఆసక్తి కనబరుస్తున్నారు.
ATC Student Scholarship | విద్యాశాఖకు రూ.26 వేల కోట్లు
బడ్జెట్లో విద్యా శాఖ (Education Department)కు రూ.26,674కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖకు రూ.13,679 కోట్లు, కార్మిక శాఖకు రూ.998 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.3,143 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,784కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.7,937 కోట్లు కేటాయింపులు చేశారు. బీసీ సంక్షేమానికి రూ.3,769 కోట్లు, రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు, గృహా నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు కేటాయించారు.
ATC Student Scholarship | పరిశ్రమల శాఖకు..
పరిశ్రమల శాఖకు రూ.3,490 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. చేనేత రంగానికి 258 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్లు, నీటిపారుదల శాఖకు 22, 615 కోట్లు ప్రతిపాదించారు. ఆర్ అండ్ బీ శాఖకు రూ.12,789 కోట్లు, న్యాయ శాఖకు రూ.2,367కోట్లు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907 కోట్లు, హోం శాఖకు రూ.11,907 కోట్లు, గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రూ.500 కోట్లు, పర్యాటక శాఖకు రూ.1,224 కోట్లు కేటాయింపులు చేశారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Metro Disruption | హైదరాబాద్లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు

