Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 20, 2026 1:23 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Health Awareness Nizamabad

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​:  Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు. మాక్లూర్ మండలం (Makloor Mandal) దాస్ నగర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు.

Contents
  • Health Awareness Nizamabad | పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి..
    • Health Awareness Nizamabad | ఆరోగ్య శిబిరంలో..
      • Health Awareness Nizamabad | సరైన ఆహార నియమాలు పాటించాలి..

Health Awareness Nizamabad | పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి..

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్​ (Collector Ila Tripathi) సూచించారు. చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను రోజువారీగా తరలించేందుకు వీలుగా స్వచ్ఛ ఆటోను పాఠశాలకు పంపాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. గురుకులంలోని కిచెన్​ను, విద్యార్థినుల కోసం వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. నాణ్యమైన సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Health Awareness Nizamabad | ఆరోగ్య శిబిరంలో..

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ (Medical and Health Department) ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. వివిధ విభాగాల వారీగా విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, చక్కటి ఆరోగ్యం కోసం ఆకుకూరలు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, వెంటనే నిర్వాహకుల దృష్టికి తీసుకురావాలని, అశ్రద్ధ చేయకూడదని అన్నారు.

Health Awareness Nizamabad | సరైన ఆహార నియమాలు పాటించాలి..

సరైన ఆహార నియమాలను పాటిస్తూ, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని కలెక్టర్​ విద్యార్థినులకు మార్గనిర్దేశం చేశారు. ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా, వార్షిక పరీక్షలను ఆత్మవిశ్వాసంతో చక్కగా రాయాలని సూచించారు. బాలికల భద్రత, రక్షణ, ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని, బయటి వ్యక్తులు ఎవరూ పాఠశాల లోనికి రాకుండా గట్టి పర్యవేక్షణ చేయాలని పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్​వో శ్వేత, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, వైద్యులు సందీప్, శశిధర్, అర్వింద్​ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్

Yellareddy Industrial Development | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే మదన్​ మోహన్​
Indalwai Student | విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్​
Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
Tribal Association Support | నలుగురు చిన్నారులకు ‘గిరిజన సంఘం’ భరోసా
Water Tank Inspection | వాటర్​ ట్యాంక్​ ఎక్కిన కలెక్టర్​.. పరిశుభ్రత కార్యక్రమం పరిశీలన
TAGGED:Collector Ila TripathiHealth Awareness NizamabadMakloor MandalMedical and Health Department
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ice Cream Ban Guduru Ice Cream Ban Guduru | ఐస్‌క్రీం బండ్లకు నో చెప్పిన గ్రామం.. గూడూరు ప్రజల వినూత్న నిర్ణయంపై ప్ర‌శంస‌లు
Next Article Telangana Pension Scheme Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?