అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Pension Scheme | రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది.
రాష్ట్రంలో అర్హులైన 2 లక్షల మందికి త్వరలో చేయూత పథకంలో భాగంగా త్వరలో పింఛన్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం (Deputy Chief Minister) తెలిపారు. బడ్జెట్‌లో ఈ మేరకు కేటాయింపులు చేశామన్నారు. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వలేదు. దీంతో ఎంతో మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం ప్రకటనతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పెన్షన్లు మంజూరు కానున్నాయి.
Telangana Pension Scheme | విద్యార్థులకు అల్పాహారం
రాష్ట్రంలో కొత్తగా ఐదు పథకాలు ప్రవేశ పెడుతున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంతో పాటు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం (Breakfast Scheme) అమలు చేస్తామన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు వారానికి మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావతో కూడిన అల్పాహారం అందిస్తామని తెలిపారు.

Telangana Pension Scheme | దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఇక నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నారు. సీఎం ఓవర్సిర్స్ ఎప్లాయిమెంట్ ప్రోగ్రాం కింద రాష్ట్ర యువతకు విదేశాలలో ఉపాధి, భాషా నైపుణ్యాలు, వీసా మార్గదర్శకత్వం అందించనున్నారు. ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు ‘రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్’ వాహనాలను పంపిణీ చేస్తామని తెలిపారు.
Telangana Pension Scheme | ఆరు గ్యారెంటీలకు నిధులు..
ఆరు గ్యారెంటీల కోసం బడ్జెట్‌లో రూ.50,713 కోట్లు కేటాయించారు. మూసీ ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు, యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5 వేల కోట్లు, ఉద్యోగుల హెల్త్ స్కీం కోసం రూ.1,056 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, చేయూత పథకానికి రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5,500 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఇది కూడా చదవండి..: Telangana Budget 2026 | రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్

