అక్షరటుడే, వెబ్‌డెస్క్: Power Petrol Price Hike | పశ్చిమాసియాలో ఉద్రిక్తలతో దేశంలో ఇంధన ధరలపై ప్రభావం పడింది. ఇప్పటికే ఎల్పీజీ (LPG) ధరలను పెంచిన సంస్థలు.. తాజాగా పవర్ పెట్రోలు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. మూడు వారాలు అవుతున్న యుద్ధం ముగింపునకు రాలేదు. ఇరు పక్షాలు దాడులను తీవ్రం చేశాయి. మరోవైపు ఇరాన్ హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసివేయడంతో పాటు గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేస్తోంది. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచలేదు. అయితే తాజాగా పవర్ పెట్రోల్ ధరల పెంపునకు ఓకే చెప్పింది.
Power Petrol Price Hike | రూ.2.26 పెంపు
దేశవ్యాప్తంగా ‘పవర్’ పెట్రోల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. లీటర్‌పై రూ.2.26 పెంచడంతో పవర్ పెట్రోల్ ధర రూ.115కి చేరింది. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో రేట్లు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. దీంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే యుద్ధం ఇలాగే కొనసాగితే రేట్లు పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం

