అక్షరటుడే, లింగంపేట: Ayyappa Idol Procession | మండల కేంద్రంలో శుక్రవారం ఉత్తర శబరిమల అయ్యప్ప ఆలయం మూల విరాట్ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 1న ఉత్తర శబరిమల అయ్యప్ప ఆలయం (Ayyappa Temple) ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. అందులో భాగంగా శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అయ్యప్ప మూలవిరాట్ విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు.
Ayyappa Idol Procession | ఆకట్టుకున్న కేరళ శృంగేరి భజన మేళం
అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపులో భాగంగా కేరళ శృంగేరి (Kerala Sringeri) మేళం భజన సంకీర్తనలు ప్రత్యేకంగా నిలిచాయి. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల నుండి మూలవిరాట్టు సేవా నిమిత్తం 200 మంది మహిళలు పాల్గొని సాంస్కృతిక నృత్యాలతో ఊరేగింపు ప్రధాన వీధుల గుండా కొనసాగింది.
Ayyappa Idol Procession | ఐదు రోజుల పాటు..
లింగంపేట మండల (Lingampet Mandal) కేంద్రంలో నూతనంగా నిర్వహించిన ఉత్తర అయ్యప్ప ఆలయం ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 31న ఉత్తర శబరిమల (Uttara Sabarimala) అయ్యప్ప మూలవిరాట్ విగ్రహం స్పర్శ దర్శనం, ఏప్రిల్ 1న అయ్యప్ప ఆలయం ప్రాణ ప్రతిష్ఠకు శబరిమలై అయ్యప్ప స్వామి వంశస్థులు పాల్గొంటున్నట్లు ఆలయ ధర్మకర్త రవి గౌడ్ తెలిపారు. గ్రామంలోని మహిళలు మంగళహారతులు, కొబ్బరికాయలు అయ్యప్ప మూలవిరాట్‌కు సమర్పించారు. మండల కేంద్రంలో యాత్ర జరిగింది. ఊరేగింపు కార్యక్రమంలో గురు స్వాములు చంద్రమౌళి, రాజు, ఉదయ్, పట్నం రమేష్, శ్రీకాంత్, అరుణ్, నాగరాజు, రాజిరెడ్డి, సతీష్, సిద్ధా గౌడ్, రాంపల్లి రజనీకాంత్, వినోద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bodhan Car Theft | బోధన్‌లో ఘరానా దోపిడి.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..

