Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Budget 2026 | అన్నివర్గాలకు సంతృప్తినిచ్చిన బడ్జెట్​: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana Budget 2026 | అన్నివర్గాలకు సంతృప్తినిచ్చిన బడ్జెట్​: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ

నిజామాబాద్

Telangana Budget 2026 | అన్నివర్గాలకు సంతృప్తినిచ్చిన బడ్జెట్​: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజానుకూలంగా ఉందని.. మైనారిటీల సంక్షేమం, సామాజిక న్యాయానికి ఊతమిచ్చేలా ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ అన్నారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 20, 2026 6:11 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
Telangana Budget 2026 |
Telangana Budget 2026 | అన్నివర్గాలకు సంతృప్తినిచ్చిన బడ్జెట్​: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Telangana Budget 2026 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్(Telangana Budget 2026) ప్రజానుకూలంగా ఉందని.. మైనారిటీల సంక్షేమం, సామాజిక న్యాయానికి ఊతమిచ్చేలా ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Contents
  • Telangana Budget 2026 | సమగ్రాభివృద్ధికి దోహదం..
    • Telangana Budget 2026 | మైనారిటీ మహిళలకు..
      • Telangana Budget 2026 | రాజీవ్​ యువ వికాసం..
      •  ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు..
      • డిప్యూటీ సీఎంపై ప్రశంసల జల్లు..

Telangana Budget 2026 | సమగ్రాభివృద్ధికి దోహదం..

ఈ బడ్జెట్ రైతులకు, ప్రజలకు అనుకూలంగా ఉండటంతో పాటు సమగ్ర అభివృద్ధికి (Telangana Government) దోహదపడుతుందని షబ్బీర్​ అలీ పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమానికి (Minority Welfare India) రూ.3,769 కోట్లు కేటాయించడాన్ని స్వాగతించారు. ఇది వారి సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. గతేడాదితో పోలిస్తే రూ.178 కోట్ల పెరుగుదల ఉండడం, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుందని తెలిపారు.

Telangana Budget 2026 | మైనారిటీ మహిళలకు..

మైనారిటీ మహిళలకు 10,000 కుట్టు మెషిన్ల పంపిణీ, 4,655 మంది మైనారిటీ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాలు ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంలో సాయపడతాయని ప్రభుత్వ సలహాదారు అన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌లో మైనారిటీలను సంక్షేమ ప్రణాళికల కేంద్రంగా ఉంచి, విద్య, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక స్వతంత్రతపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.

Telangana Budget 2026 | రాజీవ్​ యువ వికాసం..

రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయించడం పట్ల కూడా (Social Justice Budget) షబ్బీర్​అలీ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువతకు ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయన్నారు. విద్యకు ప్రాధాన్యతనిస్తూ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ (Young India Integrated Residential Schools) కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 105 పాఠశాలలు ఏర్పాటు చేయబడుతున్నాయని, అందులో 79 పాఠశాలలకు అనుమతులు లభించగా, 44 చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

 ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు..

అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి రూ.36,000 కోట్లకు పైగా కేటాయించడం(Revanth Reddy) పట్ల షబ్బీర్​ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్సీలకు రూ.11,784 కోట్లు, ఎస్టీలకు రూ.7,937 కోట్లు, బీసీలకు రూ.12,511 కోట్లు కేటాయించడం సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల విడుదలతో పాటు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కార్యక్రమాల విస్తరణ ద్వారా చారిత్రక అసమానతలను తగ్గించి, వెనుకబడిన వర్గాలకు ప్రయోజనాలు చేరేలా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

డిప్యూటీ సీఎంపై ప్రశంసల జల్లు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను( Bhatti Vikramarka) ప్రశంసిస్తూ.. ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించిందని, రైతులు, బలహీన వర్గాలు, యువతకు ప్రాధాన్యతనిచ్చిందని షబ్బీర్ అలీ అన్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా సమగ్ర పాలనకు (India Budget News) కొనసాగింపని పేర్కొన్నారు. ఇది రైతులకు, ప్రజలకు అనుకూలమైన బడ్జెట్. సామాజిక న్యాయాన్ని బలపరుస్తూ, ముఖ్యంగా మైనారిటీలు, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు వేస్తోందని షబ్బీర్ అలీ తెలిపారు.

ఇది కూడా చదవండి: Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య

Gas Cylinder Explosion | గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్రగాయాలు
Telangana Road Safety Cess | పెరగనున్న వాహనాల ధరలు.. ‘రోడ్​ సేఫ్టీ సెస్’​ విధించిన తెలంగాణ ప్రభుత్వం
Women Empowerment | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మున్సిపల్ వైస్ ఛైర్మన్ భాగ్యమ్మ
Comrade Rayala Ravanna | రవన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి
Ramzan fasting benefits | ఉపవాసంతో సహనం, క్రమశిక్షణ పెరుగుతాయి: సీపీ సాయిచైతన్య
TAGGED:Bhatti VikramarkaIndia Budget NewsMinority Welfare IndiaRevanth ReddyShabbir AliSocial Justice BudgetTelangana Budget 2026Telangana GovernmentYoung India Integrated Residential Schools
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Government Hospital Deliveries Government Hospital Deliveries | ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి: డీఎంహెచ్​వో రవీందర్​ గౌడ్​
Next Article Students Drowned Students Drowned | గోదావరిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?