అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని టీపీటీఎఫ్ ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
Education Budget Neglect | విద్యారంగానికి అరకొర నిధులు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లలో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించి ప్రకటిత విద్యా లక్ష్యాలను నిర్లక్ష్యం చేశారని.. టీపీటీఎఫ్(TPTF Union) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెనిగళ్ల సురేష్, అర్వింద్ ఆరోపించారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ రూ.3,24,234 కోట్లలో కేవలం విద్యారంగానికి రూ. 26,674 కోట్లు కేటాయించడం(School Funding India) సమయోచితం కాదన్నారు. ప్రస్తుత బడ్జెట్లో గత ఏడాది కేటాయింపులకు కేవలం 0.63 శాతం మాత్రమే పెంచి కేటాయింపులను 8.23శాతానికి కుదించారని ఇది సరైంది కాదన్నారు. విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని అట్టహాసంగా ప్రకటిస్తూ, ఉన్న స్కూళ్లను బలోపేతం చేయడం విస్మరించి(Telangana Education) ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు అంటూ.. పబ్లిక్ స్కూళ్లు అంటూ పేర్కొని నిధులు మాత్రం అత్తెసరుగా విడుదల చేయడం సరికాదన్నారు.
Education Budget Neglect | విద్యారంగం మరింత దిగువస్థాయికి..
ఈ బడ్జెట్‌తో విద్యారంగం మరింత కునారిల్లి పేదలు నాణ్యమైన విద్యను పొందలేని(Education CrisisEducation Crisis) పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వెనిగళ్ల సురేష్, అర్వింద్ ఆందోళన వ్యక్తం చేశారు. అరకొర వసతులతో ఉన్న పాఠశాల వ్యవస్థ, మరింత దుర్భర స్థితిలోకి నెట్టివేయబడుతుందన్నారు. విద్యారంగ బలోపేతానికి కొఠారి కమిషన్‌తో పాటుగా, అనేక మంది విద్యావేత్తలు, ఉపాధ్యాయ ఉద్యమ సంఘాలు బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం కేటాయింపులు జరుపాలని దశబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయన్నారు.
Education Budget Neglect | హామీలను విస్మరించారు..
పాలక పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15శాతం బడ్జెట్‌ను(Telangana Budget Issues) కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోక పోవడం శోచనీయమని సురేష్, అర్వింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పాలకుల నిర్లక్ష్యం వల్ల 2021-22 లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 27లక్షల విద్యార్థుల సంఖ్య నేడు 16 లక్షలకు పడిపోయిందన్నారు. నాణ్యమైన విద్య, తరగతి గదుల నిర్మాణం, ఉపాధ్యాయుల నియామకం, భౌతిక వసతులు, సానిటేషన్, కంప్యూటర్, గ్రంథాలయాలు, స్పోర్ట్స్ తదితర విషయాల అభివృద్ధి మొత్తం బడ్జెట్ కేటాయింపుల పైనే ఆధారపడుతుందన్నారు.
Education Budget Neglect | తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్..
తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ ప్రకారం అత్యంత నిర్లక్ష్యానికి గురికాబడ్డ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం ఈ బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాల (Public Schools India)పెండింగ్ బిల్లులను ఏక మొత్తంలో విడుదల చేయాలని, టీచర్ల పెండింగు బిల్లులు, పీఆర్సీ ప్రకటనను డిమాండ్ చేస్తూ ఈనెల మార్చి 24న అన్ని జిల్లాల్లోని జిల్లా కలెక్టరేట్ల ఎదుట టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు (Teacher Protests) నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఇది కూడా చదవండి: Telangana Nominated Posts | త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. కాంగ్రెస్ నేతల కీలక భేటీ

