అక్షరటుడే, కామారెడ్డి: Twin Groom Death | ఆ ఇద్దరు కవలలు.. ఇద్దరికి అనుకున్నట్లుగానే కవలల అమ్మాయిలు భాగస్వాములుగా లభించారు. ఇంకేముంది.. కాలం కలిసి రావడమంటే ఇదేనేమో.. కవలల దినోత్సవం రోజే పెళ్లి ముహూర్తం కూడా కుదిరింది. ఇద్దరి పెళ్లిళ్లు ఒకేరోజు ఫిబ్రవరి 22 న పెళ్లి జరిగింది. అయితే ఆ పెళ్లి ఎంతోకాలం(Kamareddy News) సంతోషాన్నివ్వలేదు. కవలల్లో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో నర్మాల చెరువులో(Narmala Cheruvu) శవమై తేలాడు. ఈ ఘటన శుక్రవారం గంభీరావుపేట మండలం నర్మాల చెరువు వద్ద చోటుచేసుకుంది.
Twin Groom Death | మాచారెడ్డి మండలం ఘన్పూర్(ఎం) గ్రామానికి చెందిన..
మాచారెడ్డి మండలం ఘన్పూర్(ఎం) గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ ఇద్దరు కవలలు. వీరిద్దరూ అచ్చం ఒకే పోలికలతో ఉంటారు. వీరికి తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తిలు కూడా కవలలు భాగస్వాములుగా దొరికారు. పెళ్లి సమయంలో ఇలా కవలలను(Telangana Crime) పెళ్లి చేసుకుంటామని అనుకోలేదని, ఇది తమ అదృష్టమని(Local News Telangana) అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు సంతోషం వ్యక్తం చేశారు. అయితే పెళ్లి జరిగి నెలరోజులు కూడా గడవకముందే కవలల్లో ఒకరైన దుంపటి వినయ్ కుమార్ నర్మాల చెరువులో విగత జీవిగా మారడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. అయితే చెరువులో గల్లంతై మృతి చెందారని అనుమానిస్తున్నారు. గల్లంతయ్యాడా లేక ప్రమాదం జరిగిందా ఆత్మహత్యా అనే(Suspicious Death India) కోణంలో గంభీరావుపేట పోలీసులు విచారణ జరుపుతున్నారు. పెళ్లి జరిగి నెలరోజులు కూడా గడవకముందే వినయ్ కుమార్ మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్‌పై కవిత విమర్శలు

