అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaushik Reddy Shock | హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)కి ఆయన అనుచరులు షాక్ ఇవ్వడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆయన అనుచురుల్లో కొంతమంది రహస్యంగా సమావేశం అయ్యారు.
కౌశిక్‌రెడ్డి 2023 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గెలుపు కోసం కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. అయితే గెలిచాక తమను పట్టించుకోవడం లేదని పలువురు అనుచరులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన అనుచరులు రహస్యంగా సమావేశం అయ్యారు.
Kaushik Reddy Shock | పార్టీ మారే యోచన
కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో అనుచరులు, బీఆర్ఎస్ (BRS) క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారు పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కొంతమంది నాయకులు సమావేశమై కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు, కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి..: SSC Exams | ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

