Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!

తెలంగాణతాజా వార్తలు

Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో కలకలం రేగిన “10వ తరగతి పబ్లిక్ పరీక్షల రద్దు” వార్తలపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. అసలు ప్రతిపాదన ఏమిటి? విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అనే దానిపై పూర్తి వివ‌ర‌ణ ఇచ్చింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 21, 2026 11:13 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 రోజులు ago
Share
Telangana SSC Exams

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana SSC Exams | తెలంగాణలో నిన్నటి నుంచి చర్చనీయాంశంగా మారిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల రద్దు అంశంపై రాష్ట్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా విద్యా సంస్కరణలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ గందరగోళం ఏర్పడింది.

Contents
  • Telangana SSC Exams | విద్యాశాఖ క్లారిటీ
    • Telangana SSC Exams | విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని స్పష్టం

సీఎం వ్యాఖ్యలలో భాగంగా, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్‌సీ (10వ తరగతి), ఇంటర్మీడియట్ బోర్డులను రద్దు చేసి ఒకే ఉమ్మడి బోర్డు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియా (Social Media), కొంత మీడియా వర్గాల్లో “10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తిగా రద్దవుతున్నాయి” అనే వార్తలు వేగంగా వ్యాపించాయి.

Telangana SSC Exams | విద్యాశాఖ క్లారిటీ

ఈ ప్రచారంపై స్పందించిన తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్, ఈ వార్తలను ఖండించారు. తమ కమిషన్ నివేదికలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలనే ప్రతిపాదన ఎక్కడా లేదని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం విడివిడిగా ఉన్న ఎస్ఎస్‌సీ మరియు ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేసి ఒకే ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేయాలని సూచించినట్లు వెల్లడించారు. అదే సమయంలో, 11వ తరగతి పబ్లిక్ పరీక్ష (Public Exams)లను మాత్రమే రద్దు చేయాలని తమ నివేదికలో ప్రతిపాదించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై విద్యాశాఖ (Education Department) ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు అసత్య వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచించింది. అధికారిక ప్రకటనలకే ప్రాముఖ్యత ఇవ్వాలని కోరింది.

Telangana SSC Exams | విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని స్పష్టం

ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం (NEP)కు అనుగుణంగా 10+2 వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ ఇంకా అధ్యయనం కొనసాగిస్తున్నదని, కమిషన్  ఇచ్చిన నివేదిక తుది నిర్ణయం కాదని సీఎం పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు

Middle East Oil Loss | ఇరాన్​ – ఇజ్రాయెల్​ – అమెరికా యుద్ధం.. భారీగా క్రూడ్​ ఆయిల్​ ధ్వంసం.. నష్టం ఎంతంటే!
Tirumala VIP Break Darshan | 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
March 12 Horoscope | జీవిత భాగస్వామి అండతో.. కష్టాల నుంచి గట్టెక్కే అదృష్ట రాశులవారు వీరే!
Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
March 18 Horoscope | ఉద్యోగ యోగం.. ఈ రాశుల వారికి మెరుగుపడనున్న ఆర్థిక స్థితి!
TAGGED:CM Revanth ReddyEducation DepartmentPublic ExamsSocial MediaTelangana SSC exams
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article  Kaushik Reddy Shock Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!
Next Article Hormuz Indian Death Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?