అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chandrababu Tirumala visit | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన మనవడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా సతీమణి భువనేశ్వరి, కుమారుడు మంత్రి లోకేష్ (Minister Lokesh)తో కలిసి శ్రీవారిని శనివారం ఉదయం దర్శనం చేసుకున్నారు.
Chandrababu Tirumala visit | స్వాగతం పలికిన అర్చకులు
సీఎం చంద్రబాబు నాయుడు వైకుంఠం క్యూకాంప్లెక్స్ (Vaikuntam Queue Complex) ద్వారా ఆలయంలోకి వెళ్లారు. మహాద్వారం వద్దకు చేరుకోగానే అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి విమాన వేంకటేశ్వరస్వామి, యోగనరసింహ స్వామివారిని దర్శనం చేసుకుని.. హుండీలో కానుకలు సమర్పించారు.
Chandrababu Tirumala visit | వేద పండితుల ఆశీర్వాదం
శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వామివారి శేష వస్త్రాన్ని అందించారు. తరువాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరిలు.. ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, పరాభవ నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్ అందించారు.

Chandrababu Tirumala visit | భక్తులకు ఆహారం వడ్డించిన సీఎం
తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనుమడు దేవాన్ష్‌తో కలిసి భక్తులకు ఆహారం వడ్డించారు. అనంతరం సతీమణి, కుమారుడు, మనుమడితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పలువురు టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా అధికారులు, టీటీడీ జేఈవోలు వీరబ్రహ్మం, డాక్టర్ శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మా మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాం. ఏడుకొండల వాడి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులందరం కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి వారి సేవలో తరించాం. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు, భక్తులతో… pic.twitter.com/QWhYzwyQTE
— N Chandrababu Naidu (@ncbn) March 21, 2026
ఇది కూడా చదవండి..: Vizianagaram Bus Fire | విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రయాణికుల్లో ఎంఎల్ఏ కూడా ఉన్నారా..!

