అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anirudh Hyderabad Concert | ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కాన్సర్ట్ (Music Concert) నేడు గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో యువత, అభిమానులు తరలి రానున్నారు. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేగాకుండా గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium) సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ యువ సంగీత దర్శకుడిగా (Young Music Director) క్రేజ్ సంపాదించారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఆయనకు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో నగరంలో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. అనిరుధ్ కెరీర్ 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా టూర్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి ఈవెంట్ హైదరాబాద్ (Hyderabad)లో జరగనుంది. సాయంత్రం 7 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది.
Anirudh Hyderabad Concert | ట్రాఫిక్ ఆంక్షలు
అనిరుధ్ ఈవెంట్ పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. నేడు సాయంత్రం 4 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియం సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలు చేయనున్నారు. ఈ సమయంలో స్టేడియం పరిసరాల్లో సాధారణ వాహనాల రాకపోకలపై పరిమితులు ఉంటాయి. గచ్చిబౌలి జంక్షన్, ట్రిపుల్ ఐటీ (IIIT) జంక్షన్, విప్రో సర్కిల్ వైపు వెళ్లే మార్గాల్లో దారి మళ్లింపులు అమలు చేస్తున్నారు.
Anirudh Hyderabad Concert | ఇలా వెళ్లాలి
ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా వాహనదారులు ఈ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. గచ్చిబౌలి చౌరస్తా నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వారు.. నేరుగా వెళ్లడానికి అనుమతి లేదు. వారు ట్రిపుల్ ఐటీ (IIIT) జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకోవాలి. అనంతరం విప్రో జంక్షన్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి గౌలిదొడ్డి, గోపన్‌పల్లి తండా, నల్లగండ్ల మీదుగా వెళ్లొచ్చు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గోపన్‌పల్లి తండా, క్యూసిటీ (Q City) ప్రాంతాల నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వచ్చే వాహనదారులు సైతం ప్రత్యామ్నాయ మార్గంలో రావాలి. విప్రో జంక్షన్ నుంచి నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ (ORR) జంక్షన్ వద్ద మలుపు తీసుకోవాలి. అనంతరం గచ్చిబౌలి ప్రధాన మార్గంలోకి ప్రవేశించాలి.
ఇది కూడా చదవండి..: Hyderabad Metro Disruption | హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం.. నిలిచిన రైళ్లు

